హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను టీ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 మి.లీ లిక్విడ్ మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ న్యాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నామని అన్నారు. సూరారం పోలీసులతో పాటు టీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని పేర్కొన్నారు.
హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. కాగా.. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్,…
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. సాయి అనే యువకుడు విచక్షణారహితంగా ప్రవర్తించాడు. కామంతో కళ్ళుమూసుకోపోయి మానవ మృగంలా వ్యవహరించాడు.
10 special trains Between AP and Telangana: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. 10 ప్రత్యేక రైళ్లను డిసెంబర్ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి (07482) రైలు డిసెంబర్ 4-25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-సికింద్రాబాద్ (07481) రైలు డిసెంబర్ 3-31 వరకు ప్రతి ఆదివారం, హైదరాబాద్-నర్సాపూర్ (07631) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి…
Telangana Elections Live Updates: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. అయితే తెలంగా వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తే అత్యధికంగా మెదక్ జిల్లాలో 70 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్లో…