DCP Sharath Chandra:హైదరాబాదులో మరొకసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. న్యూ ఇయర్ కోసం డ్రెస్ తీసుకొస్తున్న ముగ్గురు అదుపులో తీసుకున్నారు పోలీసులు. ముగ్గురు నుంచి ఏడు లక్షల విలువైన 100 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ చంద్ర పవార్ అన్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో విక్రయించేందుకు మహారాష్ట్ర నుండి తీసుకు వచ్చారని క్లారిటీ ఇచ్చారు. 2000 లకు ఒక గ్రాము కొని..హైదరాబాద్ లో ఏడు వేలకు అమ్ముతున్నారని అన్నారు. నిందితులు మహారాష్ట్ర లో ఒక నైజీరియన్ జ్యో నుండి కొన్నట్టు ఒప్పుకున్నారని అన్నారు. పరారీలో వున్న జ్యొ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నామని అన్నారు. డ్రగ్స్ అమ్మే వారిపై… కొనే వారిపై పోలీసులు నిఘా పెట్టామని అన్నారు.
Read also: Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీకి మరో అరుదైన గుర్తుంపు..
కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వాడితే… కటిన చర్యలు తప్పవన్నారు. నిందితుడు అనూప్ గతం లోనూ డ్రగ్స్ సరఫరా చేస్తూ నార్కోటిక్స్ విభాగానికి చిక్కాడని అన్నారు. ఎనిమిది నెలలు జైల్లో ఉండి.. బెయిల్ పై విడుదల అయ్యాడని అన్నారు. నిందితుడు అనూప్ పై పీడీ చట్టం ప్రయోగిస్తామని తెలిపారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా వారందరూ గతంలో బెయిల్ పై విడుదలైన వారే అని, అయితే విడుదలైన కూడా వాళ్ల ధోరణి మారలేదని డ్రగ్స్ అమ్మకాలు అలాగే కొనసాగిస్తున్నారని తెలిపారు. డబ్బులకు ఆశపడి అందులో ఎక్కువ మణి రావడంతోనే డ్రగ్స్ విక్రమాలపై మళ్ళీ మళ్ళీ వాటిపై ఇంట్రెస్ట్ చూపుతున్నారని తెలిపారు. అయితే డ్రగ్స్ అమ్మేవారిపైనే కాదు, కొనే వారిపై కూడా నిఘా ఉంచామని అన్నారు. ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే కఠినచర్యలు తప్పవని అన్నారు.
Salaar: మోస్ట్ అవైటెడ్ పోస్ట్ వచ్చేసింది… సలార్ @ 500 క్రోర్స్