తప్పుడు భూరికార్డు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టి వారి రిట్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఆ భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)కు చెందుతాయని ఇవాళ తీర్పు ఇచ్చింది.
మహానగరం హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు తమ ఔట్లెట్లను ప్రారంభించాయి. తాజాగా ప్రముఖ రిటైల్ సంస్థ వాల్యూ జోన్ హైదరాబాద్‌లో హైపర్‌మార్ట్‌ను ప్రారంభించబోతోంది. పటాన్చెరు వద్ద ఏర్పాటు చేసిన ఈ హైపర్ మార్ట్‌ను ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ తమ చేతుల మీదుగా రేపు(డిసెంబర్ 15) ప్రారంభించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
నేనావత్ సూర్య నాయక్ లాక్ అప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు చేయాలి అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. అన్న దమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణం అయ్యారు..
సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటాను.. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోం.. శాసన సభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం ఈనెల 18 నుంచి రాష్ట్రపతి హైదరాబాద్ కు రానున్నారు. ఈ నెల 23 వరకు అంటే ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమే బస చేయనున్నారు. అనంతరం తిరిగి 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు.
U19 World Cup 2024 India Squad: అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్‌లో అండర్-19 ఆసియాకప్ 2023లో పాల్గొంటున్న జట్టునే మెగా టోర్నీకి ఎంపిక చేసింది. ప్రపంచకప్ జట్టుకు పంజాబ్‌కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మధ్యప్రదేశ్‌కు చెందిన సౌమ్య్కుమార్ పాండే వైస్ కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు ప్రపంచకప్ జరగనుంది.…
మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023లో హైదరాబాద్ "భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం"గా ర్యాంక్ చేయబడింది.. ఈ జాబితాలో 153వ ర్యాంక్‌తో హైదరాబాద్ టాప్ స్పాట్లో నిలవగా.. ఆ తర్వాత 154వ ర్యాంక్‌తో పుణె రెండో స్థానం, 156వ ర్యాంక్‌తో బెంగళూరు మూడో స్థానం, 161 ర్యాంక్‌తో చెన్నై నాలుగో స్థానం, 164 ర్యాంక్‌తో ముంబై ఐదో స్థానం, 170 ర్యాంక్‌తో కోల్‌కతా ఆరో స్థానం, 172 ర్యాంక్‌తో న్యూఢిల్లీ ఏడో స్థానంలో నిలిచాయి.
భార్యా, భర్తల మధ్య గొడవలు జరగడం కామన్.. కొన్ని గొడవలు ఆత్మ హత్య చేసుకొనేవరకు వెళ్తున్నాయి.. అలాంటి ఘటనలే ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. వ్యసనాలకు అలవాటు పడిన భర్తను మద్యం మానెయ్యమని భార్య బ్రతిమలాడుతుంది.. అతను వినకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది.. దానికి భర్త ఏమైనా చేసుకో నేను మారనని తేల్చి చెప్పిన భర్త.. భార్య, భర్త కళ్ళముందే ఉరివేసుకుంటుంటే భర్త దాన్ని వీడియో తీసాడు.. భార్య…