IT Raids: హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్.. ఏకకాలంలో 15 చోట్ల..
- హైదరాబాద్ లో ఐటీ సోదాలు
- ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్
- హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్ పై ఐటి సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నారు ఐటీ అధికారులు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్ పై ఐటి సోదాలు జరుపుతున్నారు. పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న పిస్తా హౌస్, షా గౌస్ హోటల్స్ పై ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు హోటల్స్ ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి.
Also Read:Fitness Exercises: గ్రామాల్లో చేసే పనులతో.. జిమ్ లో మహిళలకు ట్రైనింగ్
Also Read
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
పిస్తా హౌజ్, షా గౌస్ హోటల్ ఓనర్ల ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. హోటల్స్ ప్రధాన కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ లోని పిస్తా హౌజ్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ మస్తాన్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో రికార్డుల్లో చూపిన ఆదాయం… నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. ట్యాక్స్ చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 4 టీమ్స్ తో మస్తాన్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు.
Also Read:HIV Cases: పారిశ్రామిక వాడలో రోజురోజుకు పెరుగు తున్న హెచ్ ఐవీ కేసులు..
మెహిఫిల్ రెస్టారెంట్ ఓనర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్ చైన్లపై ఐటీ సోదాలు జరుపుతున్నారు. భారీ స్థాయిలో పన్ను ఎగవేత ఆరోపణలతో సోదాలు చేస్తున్న ఐటీ.. కోట్ల రూపాయల విలువైన అమ్మకాల వివరాలు గోప్యంగా ఉంచినట్టు అనుమానిస్తున్నారు ఐటీ అధికారులు. పిస్తా హౌస్, షా గౌస్, మెహిఫిల్ గ్రూప్‌కు చెందిన కార్యాలయాలు, వారికి సంబంధించిన నివాసాలు, ఇతర సంబంధిత ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు జరుపుతున్నారు. ఈ మూడు బ్రాండ్లకు చెందిన పలు యూనిట్లు, శాఖలు, అకౌంటింగ్ సెక్షన్లు, గిడ్డంగులు, నిర్వాహకులకు చెందిన ఇళ్లు వంటి చోట్ల ఒకేసారి సోదాలు జరుపుతున్నారు. మెహిఫిల్ రెస్టారెంట్ కి నగరంలో 15 బ్రాంచీలు.. అదనంగా యుఏఈలో కూడా బ్రాంచ్ లు ఉన్నట్లు గుర్తించారు. పిస్తా హౌస్ కి విదేశాల్లో కలిపి మొత్తం 44 స్టోర్ లు ఉన్నట్లు గుర్తించారు. గచ్చిబౌలి, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల్లో షా గౌజ్ హోటళ్లు ఉన్నట్లు గుర్తించారు ఐటీ అధికారులు.
తాజావార్తలు
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?