EV Chargers Theft: ఓరి వెధవల్లారా.. ఈవీ ఛార్జింగ్ గన్స్ చోరీ చేయడం ఏంట్రా..?
- జీహెచ్ఎంసీ ఈవీ ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఛార్జర్లు కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు..
- ఉప్పల్ నుంచి తార్నాక వచ్చే రూట్లో ఛార్జింగ్ పాయింట్ వద్ద ఘటన..
- తన ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ అయిపోవడంతో.. ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఆగిన కారు యజమాని..
- ఛార్జింగ్ పాయింట్ల వద్ద చార్జర్లు కట్ చేసి ఎత్తుకెళ్లడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసిన కారు ఓనర్..
- జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైన ఛార్జింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EV Chargers Theft: గ్రేటర్ హైదరాబాద్ లో ఈవీ ఛార్జింగ్ పాయింట్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఛార్జర్లు కట్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఉప్పల్ నుంచి తార్నాక వచ్చే మార్గంలోఛార్జింగ్ పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఎలక్ట్రిక్ కారులో ఛార్జింగ్ అయిపోవడంతో, హైదరాబాద్ నగరంలోని పలు ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఛార్జింగ్ పెట్టుకునేందుకు కారు ఓనర్ ఆగాడు. ఛార్జింగ్ పాయింట్ల వద్ద చార్జర్లు కట్ చేసి ఎత్తుకెళ్లడం గమనించి ఆశ్చర్యపోయిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Also: Bhagyashri Borse : అందమా, లక్కా.. త్వరలో తేలనుంది!
Also Read
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
అయితే, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈవీ వాహనదారులు కోరుతున్నారు. ఛార్జింగ్ గన్స్ చోరీ కావడం ఇదే మొదటిసారి కాదు. ఇక, నగరంలో ఛార్జింగ్ పాయింట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు గానీ నిర్వహణ లోపం క్లియర్ గా కనిపిస్తుంది. చాదర్ఘట్ ఇసామియా బజార్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్ వద్ద కూడా గత మార్చి నెలలో ఇలాగే ఛార్జింగ్ గన్స్ ను ఎత్తుకెళ్లారు.
Read Also: Muslim Countries: ఇస్లాంలో మద్యం నిషేధం.. అయినా ఈ ముస్లిం దేశాలలో..
ఇక, ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాలతో పోలిస్తే జీహెచ్ఎంసీ ఈవీ చార్జింగ్ సెంటర్లలో ఛార్జింగ్ పెడితే అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఈ స్టేషన్లను 60 కిలోవాట్స్ కెపాసిటీని కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఒక్కో కారు 20 యూనిట్స్కి పైగా కెపాసిటీతో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని ఛార్జింగ్ సెంటర్లలో ఛార్జింగ్ పెడితే 35 నుంచి 40 నిమిషాల్లోనే బ్యాటరీ పూర్తిగి నిండిపోతుంది. అలాగే, గ్రేటర్లో 200కు పైగా ప్రైవేట్ ఛార్జింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో యూనిట్కు 20 నుంచి 25 వరకు డబ్బులు తీసుకుంటున్నారు. ఇక, 18 శాతం జీఎస్టీ కూడా కలెక్ట్ చేస్తున్నాం.. అదే జీహెచ్ఎంసీ సెంటర్ల దగ్గర యూనిట్కి రూ.13తో పాటు 18 శాతం జీఎస్టీ కలిపి రూ.15.34 వరకు మాత్రమే చేస్తున్నారు. పేమెంట్ కూడా టీఎస్ఈవీ యాప్ ద్వారా చేసేందుకు అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!