ఉన్నత విద్యావంతురాలు. ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. మెడిసిన్‌లో ఇంకా స్పెషలైజేషన్ చేయాలనుకుంది. అందుకోసం అమెరికా కూడా వెళ్లింది. అంతేకాకుండా ఒక ప్రముఖ ఆస్పత్రిలో ఉద్యోగం కూడా వచ్చింది. ఓ సారి రక్తసంబంధుల్ని చూసేందుకు భారత్‌కు వచ్చింది. ఇక్కడే ఆమె ఆశలు తల్లకిందులయ్యాయి. తిరిగి వెళ్లేందుకు వీసాకు దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురైంది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఇక జీవితం లేదనుకుందో.. ఏమో తెలియదు గానీ ఈ లోకాన్ని విడిచి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని పద్మారావు నగర్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
రోహిణి (38) ఏపీలోని గుంటూరు వాసి. కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అనంతరం స్పెషలైజేషన్ కోసం మూడేళ్ల కిందట హెచ్ 1బీ వీసాపై అమెరికా వెళ్లింది. చదువు పూర్తయ్యాక ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఉద్యోగానికి ప్రయత్నించగా సెలెక్ట్ అయింది. అయితే ఒకసారి కుటుంబ సభ్యుల్ని చూసేందుకు మే నెలలో భారత్‌కు వచ్చింది. ఇంతలోనే అమెరికా వీసా జారీలో కఠిన నిబంధనలు వచ్చాయి. హెచ్ 1 బీ వీసాను జే 1 వీసాగా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి దరఖాస్తు చేస్తే అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. మస్క్ నిర్వహించిన ‘DOGE’ శాఖ మూసివేత
దీంతో హైదరాబాద్‌లోని పద్మారావునగర్‌లోని ఒక ప్లాట్‌లో ఉంటున్న ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. కొద్దిరోజులుగా ఆందోళనకు గురవుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అధిక మోతుదులో నిద్రమాత్రలు మింగి.. ఇంజక్షన్ తీసుకోవడంతో తుదిశ్వాస విడిచింది. హైదరాబాద్‌లోని మరొక ప్రాంతంలో ఉన్న కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ప్లాట్‌కు వచ్చి చూడగా విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా ఆత్మహత్మ చేసుకున్నట్లుగా నిర్ధారించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వీసా రాకపోవడంతో డిప్రెషన్‌కు గురైనట్లుగా ప్రాథమికంగా తేల్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. నివేదిక వచ్చాక అసలు కారణం తెలుస్తుందని చెప్పారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రోహిణి తల్లి లక్ష్మి మాట్లాడుతూ.. తన కూతురు ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాలని కుందని… కానీ వీసా తిరస్కరణకు గురవ్వడంతో మనస్తాపానికి గురైందని తెలిపింది. లైబ్రరీలు దగ్గరగా ఉంటాయని పద్మరావు నగర్‌లో ఉంటుందని.. ఆమె తెలివైన విద్యార్థిని అని చెప్పుకొచ్చింది. 2005-2010 వరకు కర్గిస్థాన్‌లో ఉందని.. మంచి రికార్డ్ ఉన్నట్లుగా పేర్కొంది. భారత్‌లోనే ఉండమని అడిగితే.. భవిష్యత్ బాగుంటుందని అమెరికా వెళ్తానని చెప్పిందని వెల్లడించింది. కుమార్తెకు ఇంకా వివాహం జరగలేదని తెలిపింది. ఇంట్లో ఒంటరిగా ఉండడం వల్లే ఇలా జరిగిందంటూ వాపోయింది. కేసును చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.