Hit and Run: తాతలు, తండ్రులు ఆస్తులు సంపాదించారు. ఈ క్రమంలో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించాడు. కన్ను మిన్నూ కానకుండా కారు నడిపించాడు. ఒకరి మృతికి కారణమయ్యాడు. ఐతే స్థానికులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో నిందితున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎవరతడు? అసలు జరిగిందేంటి? హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు.. అతడి కార్ వేగానికి అంతులేదు.. ఎవరైనా అడ్డం వస్తే అలాగే ఢీకొడతాడు. ఇంకా చెప్పాలంటే కారుకు బ్రేక్లున్నా పెద్దగా వాడడు.…
Child Murder: హైదరాబాద్ మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. చిన్నారి సుమయను హత్య చేసింది ఆమె మామ, అత్తగా నిర్ధారించారు. వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్ధిక లావాదేవీలు, మూఢ నమ్మకాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరినీ కటకటాల వెనక్కి నెట్టారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోల్లో ఉన్న వీరి పేర్లు.. మీర్ సమీ అలీ, యాస్మిన్ బేగం. వీరిద్దరూ…
Koti Deepotsavam 2025: భారతీయ ఆధ్యాత్మికతకు, సనాతన ధర్మానికి నెలవైన తెలుగు గడ్డపై భక్తి టీవీ ప్రతి సంవత్సరం నిర్వహించే అద్భుతమైన కార్యక్రమం ‘కోటి దీపోత్సవం’. ఈ దివ్యమైన కార్యక్రమం ఈ సంవత్సరం కూడా భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ముంచెత్తడానికి రెడీ అయింది. శివపార్వతుల అనుగ్రహం కోసం, భక్తులు కోటి దీపాల కాంతులలో ఆధ్యాత్మిక సమ్మేళనం జరగనుంది. 7000mah బ్యాటరీ, 50MP కెమెరా, IP64 రేటింగ్‌తో బడ్జెట్ రేంజ్లో రాబోతున్న Moto G06 4G స్మార్ట్‌ఫోన్ ఇకపోతే,…
Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా జిల్లాలలో భారీగా వర్షం కురుస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాష్ట్రం మొత్తం వరుణిడికి దెబ్బకి అతలాకుతలమయ్యింది. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సంగతి గురించి చెప్పనక్కర్లేదు. కొద్దిపాటి వర్షం పడితేనే జలమయమయ్యే రోడ్లతో ఇబ్బంది పడే నగరవాసులు ఇప్పుడు కుండపోత వర్షం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. illicit Affairs: తిరుపతిలో దారుణం.. కూతురు ముందే అల్లుడితో పెళ్ళికి…
Tragedy : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే యువత అమెరికా వంటి దేశాల్లో జరుగుతున్న దారుణ ఘటనలకు బలైపోతున్నారని తాజా ఉదాహరణ మరోసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని డాలస్ నగరంలో కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ స్వదేశంలో బీడీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. డాలస్‌లో నివాసం తీసుకొని చదువుకుంటూ, అదనంగా ఒక పెట్రోల్ బంక్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తున్నారు.…
తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) ఈ నెల 6 నుండి 20 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 100 ప్లాట్ల వేలాన్ని నిర్వహించనుంది. గత నెలలో ఈ వేలానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్ అభివృద్ధి కోసం రక్షణ శాఖ భూముల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వ తరపున ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు లేఖ రాశారు.
Alai Balai Event: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. దత్తాత్రేయ 2005లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి అర్జున్…
హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణానికి పునాది రాయి వేయడం జరిగింది. దసరా పర్వదినం సందర్భంగా శాస్త్రోక్త పద్ధతిలో పూజలు చేసి, ఎంఈఐఎల్ డైరెక్టర్ కె. గోవర్ధన్ రెడ్డి నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.