VC Sajjanar: రయ్… రయ్… మంటూ రోడ్డుపై పరుగులు పెడుతున్న వాహనాలు.. డ్రైవింగ్ సీటులో డ్రైవర్… కానీ, వారి దృష్టి రోడ్డుపై లేదు. చేతిలో మొబైల్ ఫోన్… లేదా చెవుల్లో ఇయర్‌ఫోన్స్. ఆటో రిక్షా, క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లు ఇలా చేస్తూ నగరంలో తరచుగా కనిపిస్తున్నారు. తమ జీవితంతో పాటు, ప్రయాణికుల, రోడ్డుపై ఉన్న వేలాది మంది ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెడుతున్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లో వీడియోలు చూడడం, ఇయర్‌ఫోన్స్ వినియోగించడం చట్టరీత్యా…
Hyderabad: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్ కేసర్ పరిధిలోని ఔషపూర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లల పంచాయతీ వల్ల ఏకంగా తండ్రి బలి అయ్యాడు. అయితే, ఇద్దరు చిన్నారులు గొడవ పడడంతో అమీర్ అనే వ్యక్తి మందలించాడు. ఇక, తన కొడుకునే మందలించాడనే కోపంతో అమీర్ ఇంటి మీదకు వెళ్ళి మరీ అలీ అనే వ్యక్తి దాడి చేశాడు.
Farmhouse Party: వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌజ్‌లలో పండగ వాతావరణం ఉంటోంది. ఆట, పాటలు, మందు పార్టీలతో యువత హోరెత్తిస్తున్నారు. సందట్లో సడేమియా అంటూ డ్రగ్స్, గంజాయి పార్టీలు సైతం నిర్వహిస్తున్నారు. ఐతే ఇన్నాళ్లూ యువతే ఈ పార్టీలు ఎక్కువగా చేసుకునే వారు. తాజాగా ఆ పార్టీల్లోకి మైనర్లు సైతం దిగుతున్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ప్రకటన చూసి.. మైనర్లు పార్టీకి హాజరయ్యారు. పైగా గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో…
గతంలో హైదరాబాద్ వంటకాలు అంటేనే లొట్టలేసుకుని తిన్న జనాలు.. ఇప్పుడు మాత్రం జడుసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా వరుసగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు కారణం. నగరంలో నిత్యం ఎదో చోట హోటల్ లేదా రెస్టారెంట్లలో బిర్యానీలో బొద్దింక, సాంబార్లో బల్లి, చట్నీలో ఈగ పడిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. హోటల్/రెస్టారెంట్ యాజమాన్యాలు మాత్రం మారడం లేదు. తాజాగా ఫేమస్ రెస్టారెంట్ కృతుంగలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. Also…
Moinabad Farm House Party: రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామ సమీపంలోని చెర్రీ అండ్ ఓక్స్ ఫామ్ హౌస్ పార్టీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ పార్టీలో మొత్తం 65 మంది పాల్గొన్నారు.
ACP Sabbathi Vishnumurthy: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విడుదల సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మీడియా సమావేశంలో నటుడు అల్లు అర్జున్ను ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి తాజాగా కన్నుమూశారు.
Weird Weather: తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర వాతావరణం కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతుండగా.. మరికొన్ని జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. అయితే, ఒకే సారి ఎండ, వాన రావడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు.
Hyderabad: దసరా పండగకు పల్లె బాట బట్టిన ప్రజలు ఇప్పుడు తిరుగు ప్రయాణం అవుతున్నారు. పండగ సెలవులు ముగించుకుని నగరానికి తిరిగి వస్తున్న ప్రజలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. నగరానికి చేరుకుంటున్న ప్రజలు, ఉద్యోగాలకు వెళ్లడం కోసం తమ తమ ఇళ్లకు త్వరగా చేరుకోవడం కోసం తహతహలాడుతున్నారు.
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ప్రధాన పార్టీలు సన్నాహాలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు ఈ ఎన్నికను ప్రస్టేజ్‌గా తీసుకుని.. కమిటీలు, సబ్ కమిటీలు, సర్వేలు, సమీక్షలతో బిజీగా మారిపోగా, బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి, జోరుగా ప్రచారం కూడా చేస్తోంది. అయితే, జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిని ఎంపిక చేయడానికి నలుగురి పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించింది.
Minors’ Drug Party: రంగారెడ్డి జిల్లాలోని మొయినా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల మద్యం, డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపుతుంది. పెద్ద మంగళారం గ్రామంలో ఉన్న ఓక్స్ ఫామ్ హౌస్ లో మైనర్స్ ఈ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు.