Hydra: హైదరాబాద్ మహానగరంలోని మియాపూర్‌లో భారీ స్థాయి భూకబ్జాలను అడ్డుకుని ప్రభుత్వ ఆస్తిని కాపాడింది హైడ్రా. సుమారు రూ.600 కోట్ల విలువ గల 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి పూర్తిగా స్వాధీనం చేసింది. ఈ కబ్జాలు మియాపూర్ ముక్తామహబూబ్ కుంటకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 44/5లోని కుంట భూభాగంలో ఈ కబ్జా చేసుకుంది. కబ్జా చేయడానికి కబ్జాదారులు దానిని 44/4 సర్వే నెంబర్‌గా చూపించి అక్రమ మార్పులు చేసినట్లు హైడ్రా దర్యాప్తులో బయటపడింది. కుంట కట్టపై దాదాపు 200 మీటర్ల మేర 18 షెడ్లను ఏర్పాటు చేసి నెలకు 50 వేల చొప్పున అద్దె వసూలు చేస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. అదేకాకుండా ఖాళీ స్థలాన్ని ప్రైవేట్ బస్సు పార్కింగ్ కోసం ఉపయోగించి నెలకు 8 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు హైడ్రా అధికారుల దర్యాప్తులో బయటపడింది.
కబ్జాదారుల వద్ద భూమికి సంబంధించిన ఏ పత్రాలు లేవని నిర్ధారించడంతో హైడ్రా క్షణమే చర్యలకు దిగింది. అక్రమంగా నిర్మించిన అన్ని షెడ్లను తొలగించి, భూభాగం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తిని రక్షించింది. కూన సత్యం గౌడ్, బండారి అశోక్ ముదిరాజ్ ఈ కబ్జాలకు ప్రధాన కారకులు అని హైడ్రా గుర్తించింది. వీరి వెనుక కొన్ని బడా బాబుల మద్దతు ఉన్నట్టు కూడా అధికారులు అనుమానిస్తున్నారు.
50 ఏళ్ల వయసులో కూడా 30లా కనిపించాలా? ఈ ఉసిరి మిశ్రమం రోజూ తినండి !