Minister Anitha: రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఈ సందర్భంగా యువ ఖైదీలైన 30 మందితో పాటు జైళ్లశాఖ అధికారులకు సైతం రాఖీలు కట్టింది.
విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న హోంమంత్రి వంగలపూడి అనిత.. గజపతినగరం రైల్వే స్టేషన్ రోడ్డు పురిటిపెంట గ్రామంలో వరినాట్లు వేశారు.. వరి నాట్ల పరిశీనకు పురిటిపెంట విచ్చేసిన మంత్రి అనిత.. రైతులతో ముఖా-ముఖీలో పాల్గొని అనంతరం రైతులతో పాటుగా పంట పొలను పరిశీలించారు..
ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేశారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. 6,100 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల కాగా.. ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టినట్టు తెలిపింది ఏపీ ప్రభుత్వం..
సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇక కేజీహెచ్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి.
హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాలులో సేఫ్టీ ఆడిట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయం అన్నారు. ఎల్జీ పాలిమర్ ప్రమాదంలో మృతులకు కోటి రూపాయలు ప్రకటించిన గత ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం అందజేయలేదన్నారు.
వైఎస్ జగన్ ను లేకుండా చేయాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి.. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత జగన్.. కానీ, జగన్ పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. గతంలో రెండుసార్లు జగన్ పై దాడులు జరిగాయి.. పాదయాత్ర సమయంలో అనేక అడ్డంకులు సృష్టించారు.. జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న జగన్‌కు పర్యటన సమయంలో కనీస భద్రత కల్పించకపోవటం దారుణం అన్నారు..
Home Minister Anitha: అనంతపురంలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. మా కూటమిలో ఎలాంటి అంతరుద్ద్యం లేదు.. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలి అని చురకలు అంటించింది.
Minister Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హెట్రో పరిశ్రమలో సోడియం హైపోక్లోరైట్ గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. తక్షణ చర్యల్లో భాగంగా ముగ్గురు బాధితులను మెరుగైన వైద్యం కోసం కేర్ ఆసుపత్రికి తరలించామని హోంమంత్రి తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బాధితులకు ఎటువంటి అనారోగ్య…
ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మల్లిఖార్జున రావు పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఈ కాల్స్ రాగా.. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.