Home Minister Anitha: అనంతపురంలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. మా కూటమిలో ఎలాంటి అంతరుద్ద్యం లేదు.. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలి అని చురకలు అంటించింది. నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదు.. ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు.. ఎన్డీయే ప్రభుత్వం అన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
Read Also: SLBC Tragedy: మధ్యాహ్నంలోగా మృతదేహాల వెలికితీత పూర్తి.. డీఎన్ఏ టెస్టుల తర్వాత బంధువులకు అప్పగింత
ఇక, రెడ్ బుక్ ప్రకారం మేము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడపై తిరగలేరు అని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి.. కక్షపూర్తి రాజకీయాలు చేయడం లేదు… అలా అని తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదన్నారు. చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరు.. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా.. అనుభవించేది రాజానే అని ఎద్దేవా చేశారు. పోలీస్ శాఖలో 900 కోట్లు గత అయిదేళ్లలో బకాయి పెట్టారు.. అవన్నీ మేము తీరుస్తున్నాం.. ఇంత వరకు ఏపీకీ అప్పా లేదు.. గ్రే హౌండ్స్ బెటాలియన్ లేదన్నారు మంత్రి అనిత.