ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు.. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. అయితే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని... వారిని క్రిటికల్ కేర్ సెంటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు అధికారులు.
గత ప్రభుత్వ వైఫల్యాలే ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు పెరగడానికి కారణం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హోంమంత్రి వంగలపూడి అనిత.. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ.. గతంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని గుర్తుచేసుకున్నారు..
మంగళవారం అనంతపురం జిల్లాలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం కోసం హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అనంతపురం నగరానికి చేరుకున్నారు.
ప్రజలు ఓట్లు వేసి గెలిస్తే సరిగ్గా పరిపాలన చేసే వారేమో కానీ ఈవీఎంతో గెలిచారు కాబట్టి పరిస్థితి ఇలా ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. హోంమంత్రి విఫలం అయ్యారని తోటిమంత్రి పవన్ చెప్పాడు కాబట్టి అనిత ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉంటూ జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు తగు ఆదేశాలిస్తున్నారు.
హోం మంత్రి అనితతో సమావేశం అయ్యారు జత్వానీ.. అరగంట పాటు భేటీ జరిగింది.. తన మీదున్న కేసును విత్ డ్రా తీసుకోవాలని హోం మంత్రిని కోరారు జత్వానీ కుటుంబం. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సినీ నటి జత్వానీ.. గతంలో పోలీసులు నా విషయంలో ఏ విధంగా వ్యవహరించారో హోం మంత్రికి వివరించాను. పోలీసులు నా విషయంలో.. నా ఫ్యామిలీతో దారుణంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతంగా…
కృష్ణానదిలో భారీ వరలు.. విజయవాడ అతలాకుతలం అవుతోన్న సమయంలో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం సంచలనంగా మారింది.. అయితే, దీని వెనుక కుట్ర కోణం ఉందంటూ అధికార కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు హోం మంత్రి అనిత.. ప్రకాశం బ్యారేజ్ కుల్చివేతకు కుట్ర పన్నిన జగన్మోహన్రెడ్డి, అందుకు సహరించిన వాళ్లపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరారు..