ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు నిర్వహించిన తరువాత కౌంటింగ్ ను నిలిపివేయాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంజ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం ఈరోజు తీర్పును ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కోట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఎస్ఈసీ కౌంటింగ్‌కు సంబందించిన తేదీని ప్రకటించాల్సి ఉన్నది.…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఏపీ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయి ఏడేళ్లు గడుస్తోంది. అయినా ఈ రెండు రాష్ట్రాల మధ్య విభజన పెట్టిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తరుచూ ఇరు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయతీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే జలవివాదాలు, సరిహద్దు వివాదాలు, నిధుల వాటా విషయాల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య కరెంట్ ఫైట్ నడుస్తుండటం చర్చనీయాశంగా మారింది. తమకు రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని తాజాగా…
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం పై గందరగోళం నెలకొంది. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సమాలోచనలో పడింది ప్రభుత్వం. ఇప్పటికే ట్యాంక్ బండ్ లో నిమజ్జనం ఏర్పాట్లు మొదలు పెట్టారు అధికారులు. ట్యాంక్ బండ్ లోనే గణేష్ నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలుపుతుంది.పోలీసులు నిమజ్జనంకు వచ్చే విగ్రహాలను అడ్డుకుంటే రోడ్డు మీద నే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉత్సవ సమితి.…
విద్యుత్ బకాయిల వివాదంపై ఆంధ్రప్రదేశ్ జెన్‌కో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తమకు రావాల్సిన రూ. 6,283 కోట్ల బకాయిలను చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదన్నారు. బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి పలుమార్లు…
ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది హైకోర్టు.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టిహైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథావిథిగా కొనసాగించాలని, ఉత్తర్వులను మార్పులేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంతృప్తి చెందని పక్షంలో ఛాలెంజ్ చేసుకోమని సూచించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను ఛాలెంజ్ చేసుకోవాలింది. అయితే, ఈ ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలని కోరింది సర్కార్..…
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు తీర్పుపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పందించింది.. మీడియాతో మాట్లాడిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు… దేవుణ్ణి పూజించడం… నిమజ్జనం చేయడం ప్రజల హక్కు అన్నారు.. హై కోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని.. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి.. వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇక, గణేష్ విగ్రహాలతో నీరు పొల్యూట్ అవుతుంది అనేది ఏ…
మానుకోట ఎంపీ కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.. కవితపై గతంలో నమోదైన కేసును కొట్టివేసింది కోర్టు.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ చేశారంటూ 2019లో కవితపై కేసు నమోదైంది.. ఈ కేసులో విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానాను గతంలో విధించింది.. అయితే, ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు కవిత.. అయితే, ఇప్పటికే ఈ కేసులో విచారణ జరిపిన…
వినాయక ఉత్సవాలు, నిమజ్జనానికి హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది.. అయితే, గణేశ్ ఉత్సవాల నిర్వాహణపై తెలంగాణ, నిమజ్జనం పై ఆంక్షలు విధించింది హైకోర్టు.. ఈ నేపథ్యంలో మీడియాకు ప్రకటన విడుదల చేశారు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావ్.. హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా తమకు అందలేదన్న ఆయన.. ఈ సారి సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.. ఈ నెల 19న సామూహిక నిమజ్జనం ఉంటుందని.. హుస్సేన్ సాగర్…
వైఎస్ఆర్ చేయూతపై హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బట్టుదేవానంద్ బెంచ్ ముందు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం… వైఎస్ఆర్ చేయూత అనేది రాష్ట్ర ఆర్థిక విధానం, ఆర్థిక సమర్థతకు సంబంధించిన అంశాల్లో ఒకటి. అందువల్ల ఈవ్యవహారంలో కోర్టులకుండే పాత్ర పరిమితం పథకానికి అర్హులు ఎవరు? అమలు ఎలా? అనే అంశాల్లో కోర్టుల పాత్ర పరిమితం. పెద్ద సంఖ్యలో మహిళలు ఈపథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏటా వరుసగా నాలుగు సంవత్సరాలు వారి…