గతేడాది వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.. నష్టపోయిన రైతులకు 3 నెలల్లో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది.. నాలుగు నెలల్లో బీమా సొమ్ము కూడా చెల్లించాలని ఆదేశించిన కోర్టు.. నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం, బీమా చెల్లించాలని పేర్కొంది.. పంట దెబ్బతిన్న రైతులను కూడా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది.. రైతు స్వరాజ్య వేదిక విస్సా కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ఎస్.ఆశలత పిల్ పై…
సెప్టెంబర్ 30న జరగనున్న భవానీపూర్ ఉప ఎన్నికను నిలిపివేయడానికి నిరాకరించింది కలకత్తా హైకోర్టు.. ఈ ఉప ఎన్నిక విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ ఉపఎన్నికల ప్రక్రియపై భారత ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్ మరియు జస్టిస్ రాజర్షి భరద్వాజ్ లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కాగా, మే 9న జరిగిన…
హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ఇవాళ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మార్కెట్ మూసివేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మార్కెట్‌ను బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలిస్తున్నారు. అయితే.. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై హైకోర్టును ఆశ్రయించారు పండ్ల వ్యాపారులు.. ఈ నెల 25 నుండి మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో కోర్టు మెట్లెక్కారు.. కొహెడలో నూతన మార్కెట్ నిర్మాణం పూర్తి చేసే వరకు బాట సింగారంలో…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఊరట లభించింది… ఈనెల 2వ తేదీన ఐదుగురు ఐఏఎస్‌లకు శిక్ష విధిస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పు ఇచ్చారు.. అయితే.. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేవాలను నిలిపివేసింది డివిజన్ బెంచ్.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్, ఐఏఎస్ అధికారి ముత్యాల రాజు, శేషగిరి బాబు, కెవీఎన్ చంద్రధర్ బాబు వేసిన అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు.. భూ పరిహారం పూర్తిగా అప్పటికే చెల్లించడంతో పాటు తమవంతుగా…
టీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, చెన్నమనేని పౌరసత్వం కేసు డైరీని తెలపడానికి భౌతికంగా వాదనలు వినాలని కోర్టును కోరారు చెన్నమనేని తరపు న్యాయవాది వై. రామారావు.. రాష్ట్ర ప్రభుత్వo, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు భౌతికంగా వాదనలు వినిపించడానికి సుముఖం వ్యక్తం చేశారు.. ఈ కేసులో.. అనేక రకమైన అఫిడవిట్‌లు, మెమోలు, కేస్ లాస్ ఉన్నందున.. వాదనలకు అన్ని పార్టీలు…
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. కరోనా టెస్ట్‌లతో పాటు.. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఆదేశాలిచ్చింది.. కరోనా పరిస్థితులపై ఇవాళ విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. వ్యాక్సినేషన్ 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.. ఇక, విద్యాసంస్థల్లో సిబ్బందికి 2 నెలల్లో వ్యాక్సిన్ పూర్తిచేయాలని స్పష్టం చేసింది ధర్మాసనం.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు సైతం పెంచాలని ఆదేశాలు జారీచేసింది. కాగా, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ…
టీటీడీ బోర్డుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు గళం ఎత్తగా….బీజేపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. మరోవైపు హైకోర్టులో టీటీడీపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏపి ప్రభుత్వం నియమించిన జంబో టీటీడీ పాలకమండలి వ్యవహారంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. 81 మందితో పాలకమండలి ఏర్పాటును వివిధ రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖరాశారు. 50 మందికి ఎక్స్ ఆఫిషియోగా అవకాశం ఇచ్చి బోర్డులో…
అమరావతి : ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ధాఖలు అయింది. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో నిందితుడు సాంబశివరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ హౌస్ మోషన్ పిటిషన్ స్వీకరించింది ఏపీ హైకోర్టు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న IRTC అధికారి సాంబశివరావు… గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ యండి గా విధులు నిర్వహించారు. కేంద్ర సర్వీసులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కేంద్రప్రభుత్వం అనుమతి తీసుకోవాలని పిటిషన్ లో…
రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సిజే అరూప్ కుమార్ గోస్వామి.. ఛత్తీస్ గఢ్ కు బదిలీ కాగా… ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ సిజే గా బదిలీ అయ్యారు. ఇక తెలంగాణ హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తి నియామకం అయ్యారు. కర్ణాటక హైకోర్టు యాక్టింగ్ సిజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మ ను తెలంగాణ సిజేగా బదిలీ అయ్యారు. కొలీజియం సిఫారసు మేరకు తెలుగు…
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన కలకలం సృష్టించింది.. ఇక, కేసులు నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.. అయితే, నిందితుడు రాజు ఆత్మహత్యపై అనుమానాను వ్యక్తం చేస్తూ హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. రాజు ఆత్మహత్య ఘటనపై జ్యూడీషియల్ ఎంక్వరీకి ఆదేశించింది… దీనికి వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ను జుడిషియల్ అధికారిగా నియమించింది తెలంగాణ హైకోర్టు.. నాలుగు…