దొంగతనం కేసులో పోలీసులు తీసుకెళ్లి కొట్టడంతో పోలీస్ స్టేషన్‌లోనే మరియమ్మ మృతి చెందింది. అయితే మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో పీయూసీఎల్ పిల్ పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మరియమ్మ లాకప్ డెత్ సీబీఐకి అప్పగించదగిన కేసని హైకోర్టు అభిప్రాయపడింది. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా మరియమ్మ మృతిపై…
కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అధికారి మార్పుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. అభ్యంతరాలేమైనా ఉంటే ఎస్ఈసీని ఆశ్రయించాలని పిటిషనరుకు హైకోర్టు సూచించింది. ఆ మేరకు వినతి పత్రాన్ని ఎస్ఈసీకి ఇవ్వాలని పిటిషనరుకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. సదురు పిటిషనుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి హైకోర్టు తెలిపింది. రిటర్నింగ్ అధికారి ఉండగా ప్రత్యేక అధికారిని ఎందుకు నియమించారని కమిషన్ను ప్రశ్నించిన హై కోర్టు… ప్రత్యేక అధికారి రిటర్నింగ్ అధికారికి సహాయపడేందుకు మాత్రమే నియమించామని చెప్పారు…
వరి విత్తన విక్రయాలపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ .. వరి విత్తనాలు అమ్మితే షాపు సీజ్ చేసి లైసెన్స్ ర ద్దు చేస్తానని, నేను ఉన్నంత వరకు మళ్లీ షాప్ తెరిచే అవకాశం కూడా ఉండదంటూ సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసి వ్యా ఖ్యలను రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టిందన్నారు. వరి విత్తనాలు అమ్మే విషయంలో హైకోర్టు , సుప్రీంకోర్టు…
దీపావళి అంటే బాణాసంచా.. ఇంటిల్లిపాదీ ఉదయం లక్ష్మీ పూజ చేసి రాత్రి బాణాసంచా కాల్చకపోతే పండగ పూర్తికానట్లే.. అయితే ఈసారి దీపావళికి క్రాకర్స్ ఎక్కువగా దొరక్కపోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో బాణసంచా విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా క్రాకర్స్ పై నిషేధం విధించలేదని, పర్యావరణానికి హాని కలిగించని క్రాకర్స్ మాత్రం ఉపయోగించవచ్చని తెలిపింది. దీపావళి కాళీ పూజల సందర్భంగా నిర్దేశించిన సమయంలో గ్రీన్ ఫైర్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని, ఎట్టి పరిస్థితిలోను…
ఏపీలో అమరావతి రాజధాని రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. రాజధాని రైతులు అనుమతి కోసం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వ న్యాయవాది. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని వివరించారు న్యాయవాది వి.లక్ష్మీనారాయణ. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది హైకోర్ట్. రైతుల…
దళితబంధు పథకంపై దాఖలైన నాలుగు పిటిషన్లను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు.. ఎన్నికల కమిషన్ నిర్ణయం విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హుజురాబాద్‌లో దళితబంధు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి… వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్నికల కమిషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని.. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి…
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం.. మరికొన్ని పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చింది.. ఇక, తెలంగాణ ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది విద్యాశాఖ.. అయితే, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తల్లిదండ్రులు సంఘం ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించింది.. ఇప్పటికే ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని కోర్టును కోరారు పిటిషనర్.. పరీక్షలు రద్దు…
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రమంగా జడ్జీల నియామకంపై ఫోకస్ పెట్టారు.. సుప్రీంకోర్టు నుంచి వివిధ రాష్ట్రాల హైకోర్టుల వరకు జడ్జీల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.. తాజాగా. తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జీలను నియమించారు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసిన ఏడుగురిని తెలంగాణ హైకోర్టు జడ్జీలుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జుడిషియల్ ఆఫీసర్లయిన శ్రీసుధా, సి. సుమలత, జి. రాధా రాణి, ఎం. లక్ష్మణ్,…
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్చంద్ర ప్రమాణస్వీకారం చేయించారు.. ఇవాళ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సతీష్చంద్రచే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు.. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు… కాగా, దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 16న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు…