Highcourt Telangana : తెలంగాణలో మరో మున్సిపాలిటీ ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలో మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి, పత్తిపాక మాజీ సర్పంచ్ లావుడ్యా సరిత లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జరిగిన విచారణలో నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా గుర్తించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల అభ్యర్థన ప్రకారం నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీతో పాటు అమీన్‌పేట,…
AP High Court: మావోయిస్టు నాయకులు దేవజీ, మల్లా రాజిరెడ్డి కోర్టులో హాజరుపర్చాల్సిందిగా కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్లు చేసిన అభ్యర్థనపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ యూనివర్సిటీ 2012 నియామకాలపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. యూనివర్సిటీలో 2012 నియామకాలు చెల్లవంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు విచారణ జరిపి ఈ మేరకు తీర్పును వెల్లడించింది. తాజా తీర్పు కారణంగా 45 మందికి పైగా ప్రొఫెసర్లు ఉద్యోగాలను కోల్పోనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ కొత్త నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. Also Read: T20 World Cup 2026: అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్.. పాక్…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీల రిజర్వేషన్ల భవితవ్యం ఆధారపడి ఉన్న నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం ఏ తీర్పు ఇస్తుందోనని అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్న వారు…
High Court Serious on AP Police: ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని సంచలన వ్యాఖ్యలు చేసింది. డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతుందని.. అసలు పోలీసు వ్యవస్ధ పనిచేసేది ఇలాగేనా అంటూ ఆక్షేపించింది. తిరుపతి పరకామణి కేసు విచారణలో పోలీసు శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డులు సీజ్ చేయాలని సెప్టెంబర్ 19న ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సీఐడీలో ఐజీ పోస్టు లేదనే…
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల పై సుప్రీంకోర్టు కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టు తీర్పు ను స్టడీ చేసిన ప్రభుత్వం.. సీనియర్ కౌన్సిల్ తో సుప్రీంకోర్టు లో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ మను సింగ్వి తో పాటు సిద్ధార్థ దవే.. రిజర్వేషన్ల పై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్…
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 ను తీసుకొచ్చింది. దీని ప్రకారమే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని భావించింది. జీవో 9 ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. అయితే జీవో 9పై పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు జీవో…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ, 4 వారాల వ్యవధిలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కీలక విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి హాజరై, హైకోర్టుకు ప్రభుత్వ నిర్ణయాలను వివరించారు.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. రాష్ట్రంలోని గ్రూప్ 1 ర్యాంకర్ల నియామకాలపై హైకోర్టు మధ్యంతర తీర్పును సవాలు చేసిన కేసులో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేయకుండా నిరాకరించింది.