కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. తనపై కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు కాదన్నారు సీఎస్ సోమేష్ కుమార్. కోర్టు ధిక్కరణ కేసుల్లో భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమని తెలిపిన ఏజీ.. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని వెల్లడించారు సీఎస్ సోమేష్ కుమార్. విచారణ సందర్భంగా వాస్తవాలు కోర్టు ముందుంచ లేక పోయామన్న సీఎస్.. నిధులు విడుదల చేయవద్దన్న ఆదేశాలు ఉపసంహరించాలని కోరారు.…
జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమనిర్మాణాలపై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు స్టేలు ఎత్తివేయాలని జీహెచ్ఎంసీ ఎందుకు కోరడం లేదన్న హైకోర్టు… అక్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీలోనే సుమారు లక్ష అక్రమ నిర్మాణాలున్నాయన్న హైకోర్టు… రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాల పరిస్థితి ఏమిటని కాగితాల్లో నిబంధనలు బాగున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలు నివేదించని జోనల్ కమిషనర్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నివేదికలు సమర్పించని అధికారులు ఖర్చుల…
ఓయూ భూములు కబ్జా అవుతున్నాయన్న లేఖపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఓయూ విద్యార్థి పి.రమణారావు లేఖపై హైకోర్టు విచారణకు కోరారు. సుమారు 3వేల గజాలకు పైగా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కబ్జాకు కాకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపిన ఏజీ… తులసి హౌజింగ్ సొసైటీపై పోలీసులకు ఓయూ ఫిర్యాదు చేసిందని తెలిపారు. దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని హైకోర్టు అదహేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ, అంబర్…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించింది హైకోర్టు.. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్టు తరచూ మా దృష్టికి వస్తున్నాయని పేర్కొన్న హైకోర్టు… 33 జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే సర్వే పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని.. ప్రభుత్వ భూములను గుర్తించి, జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం…
అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది… ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అమర రాజా ఫ్యాక్టరీని వెళ్లిపొమ్మని మేం చెప్పలేదన్నారు.. తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు, కాలుష్య నియంత్రణ మండలి లేవనెత్తిన అభ్యంతరాలను సరి చేసుకుని అమర రాజా ఫ్యాక్టరీ ఇక్కడే కొనసాగవచ్చు అన్నారు.. ఇక, పరిశ్రమలు తరలిపోవాలని మేం కోరుకోం అని స్పష్టం చేశారు.…
కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకం పై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ఈ నేపథ్యంలోనే.. విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ పిల్ పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా కేయూ, తెలుగు వర్సిటీ వీసీల నియామకం జరిగిందన్న పిటిషనర్… కాకతీయ వీసీకి పదేళ్ల అనుభవం లేదని తన వాదనలు హైకోర్టుకు వినిపించారు. తెలుగు…
కరోనా మహమ్మారి కారణంగా కోర్టులు కూడా ఆన్‌లైన్ విచారణకే పరిమితం అయ్యాయి… కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష విచారణకు సిద్ధం అవుతోంది తెలంగాణ హైకోర్టు.. ఆగస్టు 9వ తేదీ నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది.. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ జరగనుండగా.. రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ జరుపుతుందని.. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష…
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం పై టీఎస్ హైకోర్టు విచారణ విచారణ జరిపింది. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కేంద్రం అఫిడవిట్ ధాఖలు చేసింది. ఇక కేంద్రం ధాఖలు చేసిన అఫిడవిట్ పై కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసారు చెన్నమనేని. అయితే కౌంటర్ పిటిషన్ లపై ఇరు వాదనలు విన్న హైకోర్టు… సెక్షన్ 5 (1) f సిటిజన్ షిప్ యాక్ట్ 1955 చెన్నమనేని భారత పౌరసత్వం పొందడానికి అర్హుడాని కోర్టు కు…
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ పై వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సరైన ఆధారాలు లేవని మద్రాస్ హైకోర్ట్ కొట్టేసింది. 2000లో ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరిని నిర్వహించారు. చెన్నైకి చెందిన కాలియప్పన్ ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఈవెంట్కి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరు కాలేదు. కనీసం ఖర్చు చేసిన డబ్బు కూడా రాలేదని, రెహ్మాన్ మాత్రం లబ్ది పొందారని కాలియప్పన్ మద్రాస్ హైకోర్ట్ లో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనికిగానూ ఆయన…