విద్యుత్ బకాయిల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఏపీ జెన్‌కో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ బకాయిల వివాదంపై ఆంధ్రప్రదేశ్ జెన్‌కో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తమకు రావాల్సిన రూ. 6,283 కోట్ల బకాయిలను చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదన్నారు. బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినప్పటికీ స్పందన లేదని పిటిషన్‌లో వివరించారు. ‘‘ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలే తమకు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. డిస్కంల నుంచి బకాయిలు రావల్సి ఉంటే, వాటి నుంచి వసూలు చేసుకోవాలి కానీ జెన్ కోకు చెల్లించాల్సినవి నిలిపివేయడం సరికాదు. ఈ వివాదంపై మూడేళ్లుగా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతోంది.
ప్రభుత్వ రంగ సంస్థల దివాలా ప్రక్రియపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. అక్కడ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాం. మరోవైపు బొగ్గు సరఫరా, ఇతర సంస్థలకు బిల్లులు చెల్లించడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. వడ్డీ సహా బకాయిలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి’’ అని పిటిషన్‌లో ఏపీ జెన్ కో వెల్లడించింది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిన రూ.3,441 కోట్ల బకాయిలు చెల్లించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఏపీ జెన్ కో పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, విద్యుత్ సమన్వయ కమిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబరు 28కి వాయిదా వేసింది.
Also Read
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Tags
- AP Genco
- high court
- telangana
తాజావార్తలు
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!