India map: భారతదేశ మ్యాప్‌ని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం తప్పుగా చూపిండటంతో విమర్శలు ఎదుర్కొంది. పలువురు నెటిజన్లు దీనిపై విమర్శలు గుప్పించారు. భారత్ ఎప్పుడూ ఇజ్రాయిల్‌తో నిలుస్తుంది, ఇజ్రాయిల్ భారత్‌తో ఉందా..? అని పలువురు ప్రశ్నించారు. పొరపాటుని గమనించిన రాయబార కార్యాలయం వెంటనే తప్పుగా చూపించిన మ్యాప్‌ని వెబ్‌సైట్ నుంచి తొలగించింది.
Hassan Nasrallah: ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై దాడిని ముమ్మరం చేసింది. లెబనాన్ వ్యాప్తంగా దాడులు చేస్తోంది. సెప్టెంబర్ 27న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని వైమానిక దాడిలో హతమార్చింది. అంతకుముందు హిజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్లను హతం చేసింది. వీరిలో అత్యంత కీలకమైన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అకిల్, అలీ కర్కీ వంటి వారు ఉన్నారు. అయితే, నస్రల్లాకి బహిరంగ అంత్యక్రియలు నిర్వహించే వరకు అతడిని రహస్య ప్రదేశంలో తాత్కాలికంగా ఖననం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Iran: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం, ఇజ్రాయిల్‌పై ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ క్షిపణి దాడుల తర్వాత తొలిసారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఉపన్యసించారు.
PM Modi: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని పిలిచి ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి తరువాత పెరిగిన శత్రుత్వాలపై హోం మంత్రి, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, ఆర్థిక మంత్రి, జాతీయ భద్రతా సలహాదారుతో కూడిన కమిటీతో పాటు ప్రధాని చర్చించారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారతదేశం అన్ని పార్టీలను కోరింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం…
Iran Israel War: హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా లక్ష్యాలను ఎంపిక చేసి నాశనం చేస్తోంది. హసన్ నస్రల్లాను చంపిన తర్వాత, ఇజ్రాయెల్ మీడియా ఇప్పుడు అతని వారసుడు హషీమ్ సఫీద్దీన్‌ను చంపినట్లు పేర్కొంది. అందిన సమాచారం ప్రకారం, బీరూట్‌లో హషీమ్ సఫీద్దీన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ముగ్గురు ఇజ్రాయెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గురువారం అర్ధరాత్రి భీకరమైన వైమానిక దాడులను చేశాయని.,…
Iran Israel: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం రాబోతోందా..? అనే చర్చ నడుస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాని ఇజ్రాయిల్ దారుణంగా దెబ్బతీసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాతో పాటు దాని ప్రధాన కమాండర్లను దాడుల్లో హతమార్చింది.
ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. తగిన గుణపాఠం చెబుతామని ఇజ్రాయెల్ చెబుతూనే వచ్చింది.
సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ. దీనికి సంబంధించిన ప్రకటనను ఆ దేశ సైన్యం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.
Indian Army Chief: లెబనాన్‌లో హెజ్‌బొల్లా శ్రేణులే టార్గెట్ గా ఇజ్రాయెల్ జరిపిన ‘పేజర్ బ్లాస్ట్ ఆపరేషన్’తో ప్రపంచ షాక్ అయిందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
Hezbollah: అక్టోబర్ 7 తరహా దాడులు చేసేందుకు హెజ్‌బొల్లా సన్నాహాలు చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారీ మాట్లాడుతూ.. దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో ఇళ్లను వాడుకొని దాడులు చేసేందుకు సిద్ధమైందన్నాడు.