Isreal- Gaza Conflict: పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను క్రమంగా పెంచుతుంది. తాజాగా, గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో సుమారు 27 మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు.
Israel's Netanyahu: హెజ్‌బొల్లాకు మరో భారీ షాక్ తగిలింది. ఆ గ్రూప్ అధిపతి హసన్ నస్రల్లాను మట్టుబెట్టిన వారం రోజుల్లోనే అతడి వారసుడిగా భావిస్తోన్న హషీమ్ సఫీద్దీన్‌ను ఇజ్రాయెల్ చంపేసినట్లు బెంజమిన్ నెతాన్యహు ప్రకటించారు.
Israel-Hezbollah: హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన ఆఫీసు అధిపతి సోహిల్ హొసైన్ హొసైనీని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ హతమర్చినట్లు ఈరోజు (మంగళవారం) ప్రకటించింది. సోమవారం ఇంటెలిజెన్స్ విభాగం అందించిన ఖచ్చితమైన సమాచారంతో వైమానిక దళం దాడులు కొనసాగించింది.
Hezbollah: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మద్దతు కలిగిన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా కకావిలకం అవుతోంది. ఇజ్రాయిల్ వైమానిక దాడులతో బీరూట్ దద్దరిల్లుతోంది. హిజ్బుల్లా మిలిటెంట్లను వెతికి వెంటాడి చంపేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ చీఫ్‌గా ఉన్న హసన్ నస్రల్లాని బీరూట్ దాడిలో ఇజ్రాయిల్ చంపేసింది.
Israeli PM: హమాస్ దాడి ప్రారంభించి అక్టోబర్ 7తో సంవత్సరం అయిన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. మా సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందన్నారు. పాలస్తీనా హమాస్ మిలిటెంట్లతో పాటు లెబనాన్ లోని హిజ్బుల్లాతో పోరాడి ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్నంది అన్నారు.
Hezbollah Attacks: హిజ్బుల్లా గ్రూప్ మరోసారి ఇజ్రాయెల్ నగరమైన హైఫాపై దాడి చేసింది. ఇజ్రాయెల్ ఇజ్రాయెలీ ఓడరేవు నగరమైన హైఫాపై దక్షిణ లెబనాన్ నుంచి రాకెట్లతో దాడికి దిగింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి వార్షికోత్సవం సందర్భంగా ఈ దాడులకు దిగింది.
Israel Hamas War: 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన రోజు అంటే నేటికి సరిగ్గా ఏడాది క్రితం. గతంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్‌మెంట్ ప్రాంతాలపై హమాస్ రాకెట్లతో పెద్ద ఎత్తున విరుచుకుపడింది.
అయితే, పేజర్‌లతో హిజ్బుల్లాను చావు దెబ్బతీయడం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల గూఢచార ఏజెన్సీలను ఆశ్చర్యపరిచాయి. ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ ‘‘మోసాద్’’ పనితనాన్ని కొనియాడారు. ఇంత పెద్ద డెడ్లీ ఆపరేషన్‌ని మోసాద్ ఎలా చేసింది.. హిజ్బుల్లా చేత పేజర్లను ఎలా కొనేలా చేసిందనే దానిపై ది వాషింగ్టన్ పోస్ట్ కీలక కథనం నివేదించింది. హిజ్బుల్లా ఇజ్రాయిల్ ఉచ్చులో ఎలా చిక్కుకుందనే వివరాలను వెల్లడించింది.
Israel Hezbollah War: లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థని నామరూపాలు లేకుండా చేయాలని ఇజ్రాయిల్ భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే రాజధాని బీరూట్‌పై వైమానికి దాడులతో విరుచుకుపడుతోంది. ఇక దక్షిణ లెబనాన్‌పై భూతల దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 2000కి పైగా హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. గత వారం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని ఇజ్రాయిల్ బీరూట్ ఎయిర్ స్ట్రైక్స్‌లో హతమార్చింది.
Israel: ఇజ్రాయిల్ హిజ్బుల్లాను పూర్తిగా తుడిచివేయాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. లెబనాన్ దాని రాజధాని బీరూట్‌పై భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని గత వారం బీరూట్‌లో వైమానిక దాడి చేసి హతం చేసింది.