Germany: ఇటీవల కాలంలో యూరప్ లోని పలు దేశాల్లో ఇస్లామిక్ తీవ్రవాదం చాపకింద నీరులా పెరుగుతోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో పలు దేశాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యం యూదులకు వ్యతిరేకంగా, పాలస్తీనా, హమాస్‌కి మద్దతుగా భారీ ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఇవి ఆయా దేశాల్లో హింసకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, యూకేల్లో ఇలాంటి ప్రో పాలస్తీనా నిరసనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
Israel-Hamas War: లెబనాన్‌పై ఒక వేళ ఇజ్రాయిల్ దాడి చేస్తే ‘‘మూర్ఖపు తప్పిదం’’ అవుతుందని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా శుక్రవారం హెచ్చరించారు. మీరు లెబనాన్ పై ముందస్తు దాడి చేయాలని అనుకుంటే, అది మీ మొత్తం ఉనికిలో మీరు చేసే అత్యంత మూర్ఖపు తప్పు అవుతుందని ఉగ్రవాద సంస్థ చీఫ్ అన్నారు.
Wagner Group: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. యూరప్, అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలన్నీ ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపుతుందడగా.. అరబ్ సమాజం పాలస్తీనా వెంబడి నిలబడుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి దారుణ మారణహోమానికి పాల్పడ్డారు. 1400 మందిని హతమార్చారు. దీని తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. దీంట్లో 9 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.
Benjamin Netanyahu: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ఈ యుద్ధంలోకి ప్రవేశిస్తుందనే వార్తలు వస్తున్నాయి. హమాస్‌కి మద్దతుగా ఇప్పటికే ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంత సరిహద్దుపై లెబనాన్ నుంచి హిజ్బుల్లా దాడులు చేస్తోంది. దీంతో ఇజ్రాయిల్ టూ ఫ్రంట్ వార్ చేస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేసింది.
Israel: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు క్రూరమైన దాడి చేశారు. కిబ్బుట్జ్‌లోకి ప్రవేశించి ప్రజలను చిన్నాపెద్ద, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఊచకోత కోశారు.
Israel: ఇజ్రాయిల్-హమాస్ పోరు గత రెండు వారాలుగా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7న హమాస్ మారణకాండ వల్ల ఇజ్రాయిల్ లో 1400 మంది మరణించారు. హమాస్ అత్యంత క్రూరంగా పిల్లలు, మహిళలు, వృద్ధులని చూడకుండా ఊచకోత కోసింది. ఈ ఘటన తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్ ప్రాంతంపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో గాజాలో 4000 మంది మరణించారు.
Israel-hamas War: గత శనివారం ఇజ్రాయిల్ పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు దారుణ దాడికి పాల్పడ్డారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డారు. గాజాకు సరిహద్దుల్లో
Israel: ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిగిన దాడికి మరికొన్ని ఇస్లామిక్ మిలిటెంటు గ్రూపులు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయిల్ లోని వివాదాస్పద ప్రాంతాలపైకి దాడులు చేసింది. ఇజ్రాయిల్ సరిహద్దు దేశం లెబనాన్ నుంచి ఈ దాడులు జరిగాయి. ఇజ్రాయిల్ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై ఆర్టిలరీ షెల్స్, గైడెడ్ మిస్సైళ్లను పేల్చినట్లు లెబనాల్ లో ఉన్న హమాస్ మద్దతుదారు హిజ్బుల్లా ఆదివారం తెలిపింది.