Israel: ఇరాన్ చమురు, అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు ఫ్లాన్.. యూఎస్ మీడియాలో కథనాలు
- ఇరాన్ చమురు.. అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు ఫ్లాన్
- యూఎస్ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. తగిన గుణపాఠం చెబుతామని ఇజ్రాయెల్ చెబుతూనే వచ్చింది. మొత్తానికి ఇరాన్ యుద్ధానికి ఆజ్యం పోసింది. ఇరాన్‌ను ముందుగానే అమెరికా హెచ్చరించింది. దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయినా కూడా అమెరికా హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌పై క్షిపణుల దాడికి దిగింది. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించింది. అయితే అమెరికా సాయంతో గగనతంలోనే ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. అయితే కొన్ని మాత్రం టెల్‌అవీవ్ ప్రాంతంలో పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇదిలా ఉంటే ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు దిగబోతుందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ చమురు, అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగబోతున్నట్లుగా అమెరికా మీడియా పేర్కొంది. అంతేకాకుండా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని కూడా ఇజ్రాయెల్ టార్గెట్‌గా చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
Also Read
- Nepal Floods: నేపాల్‌లకు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
- Nepal Floods: నేపాల్‌లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
- Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి కారణమిదేనా? వెలుగులోకి ఇస్రో కీలక ఆధారాలు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడి చేయడం ఇది రెండో సారి. ఏప్రిల్‌లో ఇదే తరహామైన దాడి చేయడంతో మిత్ర రాజ్యాల సహకారంతో తిప్పికొట్టింది. మంగళవారం కూడా అదే తరహాలో ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. అయితే కొన్ని క్షిపణులు మాత్రం టెల్‌అవీవ్‌పై పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లుగా సమాచారం. ఇటీవల హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా, హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ అంతమొందించింది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ దాడులకు దిగింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లకు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
-
Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
-
India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
-
Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాలు
-
Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!