Iran Israel War: హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా లక్ష్యాలను ఎంపిక చేసి నాశనం చేస్తోంది. హసన్ నస్రల్లాను చంపిన తర్వాత, ఇజ్రాయెల్ మీడియా ఇప్పుడు అతని వారసుడు హషీమ్ సఫీద్దీన్‌ను చంపినట్లు పేర్కొంది. అందిన సమాచారం ప్రకారం, బీరూట్‌లో హషీమ్ సఫీద్దీన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ముగ్గురు ఇజ్రాయెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గురువారం అర్ధరాత్రి భీకరమైన వైమానిక దాడులను చేశాయని., అందులో హత్యకు గురైన హిజ్బుల్లాహ్ నాయకుడు హసన్ నస్రల్లా బంధువు, సంభావ్య వారసుడు హషీమ్ సఫీద్దీన్‌పై దాడులు జరిగాయని తెలిపాయి.
Banana Side Effects: అరటి పండు తినగానే నీళ్లు తాగుతున్నారా?
ఈ ఇజ్రాయెల్ దాడి నస్రల్లాను చంపిన దాడి కంటే చాలా పెద్దదని చర్చించుకుంటున్నారు. తాజాగా జరిగిన దాడులలో బంకర్ పూర్తిగా ధ్వంసమైంది. బీరూట్‌లోని దహీహ్ శివారులోని హషీమ్ సఫీద్దీన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. సఫీద్దీన్ సీనియర్ హిజ్‌బుల్లా అధికారులతో అండర్‌గ్రౌండ్ బంకర్‌లో రహస్య సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. ఇజ్రాయెల్ నస్రల్లాను చంపిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత పెద్దదైన బాంబు దాడుల్లో ఇది ఒకటి.
America Visa: అమెరికన్ వీసా పొందడానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) లేదా లెబనాన్ లోని హిజ్బుల్లా నుండి ఇంకా అధికారిక ప్రకటన లేదు. హమాస్ నెట్‌వర్క్ అధిపతి జాహి యాసర్ అబ్ద్ అల్-రజెక్ ఔఫీని వెస్ట్ బ్యాంక్ లోని తుల్కర్మ్‌లో పగటిపూట చంపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) గురువారం రాత్రి ప్రకటించింది. సెప్టెంబరు 2న ఎట్రెటాట్‌లో కార్ బాంబింగ్ దాడికి ఓఫీ ప్లాన్ చేసినట్లు IDF ఒక ప్రకటనలో తెలిపింది. వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా అనేక దాడులకు ఓఫీ ప్లాన్ చేసినట్లు ప్రకటన పేర్కొంది.