కడప జిల్లా బద్వేల్ లో భారీ వర్షం కురుస్తోంది.. ఇవాళ వేకువ జాము నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. దీంతో బద్వేల్ పోలింగ్ పై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే… వర్షం లో నైనా పోలింగ్ సామాగ్రిని తీసుకెళుతుంది ఎన్నికల సిబ్బంది. ఎన్నికల సామాగ్రి తడవకుండా ఎన్నికల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షంలోనైనా… తమ డ్యూటీ ని సక్రమంగా నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు.
అయితే.. రేపు కూడా వర్షం బాగా పడితే.. పోలింగ్ శాతం తగ్గే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కాగా… బద్వేలు ఉప ఎన్నిక రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకూ పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గానికి మూడో సారి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ నియోజకవర్గంలోని మొత్తం 2లక్షల 15వేల 292మంది ఓటర్లు ఉన్నారు.
ఇందులో లక్షా 7వేల 915 మంది పురుషులు, లక్షా ఏడువేల 355మంది మహిళలు. ఏడు మండలాల్లో 281 పోలింగ్ కేంద్రాలు ఉంటే.. అందులో 148 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. 2 వేల మందితో పోలింగ్ కు బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 కంపెనీల కేంద్ర పోలీస్ బలగాలు ఎన్నిక నిర్వహణలో పాలుపంచుకుంటారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 10 మంది పోలింగ్ సిబ్బంది, 11వందల 24 మంది పోలీసులు ఉంటారు.