తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు.. పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి.. కొన్ని చోట్ల భారీ నష్టాన్ని మిగిల్చాయి.. ఇప్పుడిప్పుడే కాస్త తెరపి ఇస్తుండా.. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్సాలు ఒకటి, రెండు చోట్ల.. ఎల్లుండి కొన్ని ప్రదేశాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ కేంద్రం.. ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్నటి వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆంధ్ర ప్రదేశ్ నుండి దూరంగా వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో పశ్చిమ/ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో…
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. అయితే రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉరుములు, మెరుపులతో…
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, లక్ష్మీ బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతో్ంది. దీంతో గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇక అటు వరంగల్ నగరాన్ని మరోసారి వర్షాలు…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,54,997 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 56,635 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 876.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 170. 6640 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్…
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ వర్ష ప్రాభావిత 20 జిల్లాల కలెక్టర్లతో నేడు సమీక్ష నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ… ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలి. జిల్లాల్లోని అధికారులందరూ కార్యస్థావరంలోనే ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దాదాపుగా అన్ని చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండాయి. ఈ నేపథ్యంలో అన్ని…
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితి పై ఢిల్లీ నుంచి సీఎం కేసిఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీ వానల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల…
సిరిసిల్లా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు వచ్చి కాలనీల్లో చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరద ఉదృతి పెరగడంతో కాలనీలకు భారీగా వరద నీరు వచ్చిన విషయం తెల్సుకున్న మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,31,833 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 57,514 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 874.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 161. 2918 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్…
తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇక హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు సాయంత్రం కుండపోత వర్షం కురుస్తోంది. నిమిషాల వ్యవధిలో ఆకాశంలో మబ్బులు కమ్మేసి భారీ వానలు పడుతున్నాయి. భారీ వర్షం కారణంగా అంబర్‌పేట్- మూసారాంబాగ్ బ్రిడ్జి నీటమునిగింది. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరుచేరడంతో ప్రజలు తీవ్ర…