వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సైబరాబాద్ సీపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అయితే హిమాయత్ సాగర్ చెరువు, అప్ప చెరువు తదితర ప్రాంతాల పరిస్థితిని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆర్ డీ ఓ రాజేంద్ర నగర్ చంద్రకళ, జీహెచ్ఎమ్సీ, హెచ్ఎమ్ డబ్ల్యూఎస్, ఇరిగేషన్, రెవెన్యూ, ఎన్ హెచ్ఏఐ తదితర శాఖల అధికారులతో కలిసి ఈరోజు స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పా చెరువు, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ బెంగుళూరు హైవే పై అప్ప చెరువు నీరు అంతా చేరుతుందన్నారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాలు దృష్యా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. అప్పా చెరువు వద్ద మరమ్మతు పనులను ఎన్ హెచ్ఏఐ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం తో పూర్తి చేయాలన్నారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ డైవర్షన్ ను ఏర్పాటు చేశామన్నారు.
Also Read
- Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
గగన్‌పహాడ్ గ్రామం సమీపంలో శంషాబాద్ వైపు ఎన్ హెచ్ – 44 పై అప్ప చెరువు ప్రవహిస్తోంది. విమానాశ్రయం, కర్నూలు, బెంగళూరు మొదలైన ప్రాంతాలకు వెళ్లే పౌరులు ఎన్ హెచ్ – 44 కి బదులుగా ఓఆర్ఆర్ ను ఉపయోగించాలని సూచించారు. ఇక ORR సర్వీస్ రోడ్డులో టీఎస్ పీఏ నుండి శంషాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ టీఎస్పీఏ – ఖలీజ్‌ఖాన్ దర్గా- కిస్మత్‌పూర్ – బుద్వేల్ ఎక్స్టెన్షన్ – పిల్లర్ నెంబర్ 194 – ఆరాంఘర్ వద్ద మళ్లింపు తీసుకోవచ్చు. లోతట్టు ప్రాంత ప్రజలను వీలైనంత త్వరగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ మైక్ ల ద్వారా పోలీసులు అనౌన్స్ మెంట్ చేస్తున్నారన్నారు. అధికారులంతా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 కి డయల్ చేయండి లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444. ప్రకృతి సృష్టించిన విలయంలో అధికారులు, ప్రజలంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలన్నారు.
సీపీ వెంట రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్, శంషాబాద్ ఏసీపీ భాస్కర్, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వ ప్రసాద్, రాజేంద్ర నగర్ జీహెచ్ఎమ్సీ డీసీ జగన్, హెచ్ఎమ్ డబ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ రామకృష్ణ, హెచ్ఎమ్ డబ్ల్యూఎస్ డీజీఎమ్ రేణుక, రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డీఈ వేంకటేశ్వర రెడ్డి, ఇరిగేషన్ ఈఈ విశ్వ, రాజేంద్ర నగర్ ఇన్ స్పెక్టర్ కనకయ్య, మైలార్ దేవ్ పల్లి ఇన్ స్పెక్టర్ నరసింహ, ఆర్ జీ ఐ ఏ ఇన్ స్పెక్టర్ విజయ్ కుమార్, రాజేంద్ర నగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, తదితర శాఖల అధికారులు ఉన్నారు.
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?