అలర్ట్ : మూడు రోజులు పాటు భారీ వర్షాలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానున్న మూడు రోజులు 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో… రానున్న రెండు మూడు రోజుల్లో వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిస్తాయని తెలిపింది. అక్టోబరు 18 నుంచి 20 మధ్య నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నెల 18, 19తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురవవచ్చని తెలిపారు. అల్పపీడన ప్రభావం దక్షిణ తూర్పు ద్వీపకల్పంపై చూపిస్తుందని.. దీనివల్ల కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు వాన ముప్పు తప్పదని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలపైనా అల్పపీడనం ఎఫెక్ట్ చూపించనుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై అల్పపీడనం ఆవరించింది. దీంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వరుణుడి ఉగ్రరూపంతో కేరళ అతలాకుతలం అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!