గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో.. హైదరాబాద్ జంట జలాశయాలకు క్రమంగా ఇన్‌ఫ్లో పెరిగిపోతోంది.. దీంతో.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేసి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఓవైపు జంట జలాశయాల నుంచి వచ్చే నీటితో పాటు.. మరోవైపు వర్షం నీరు మూసీలో చేరడంతో.. ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ నది.. ఇప్పటికే మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్తుండగా.. చాదర్‌ఘాట్ దగ్గర ఉన్న చిన్న…
గులాబ్ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా పంట నష్టం జరిగింది అని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఒక లక్షా 56వేల 756 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. లక్షా 16 వేల ఎకరాల్లో వరి, 21వేల 78 ఎకరాల్లో మొక్కజొన్న ప్రధానంగా దెబ్బ తినింది. కృష్ణా జిల్లాలో సుమారు పదివేల ఎకరాల్లో పత్తి దెబ్బతినింది. అయితే ఇవి ప్రాథమిక అంచనాలు మాతర్మే అని…
తెలంగాణను గులాబ్ తుఫాన్ వణికించింది. సైక్లోన్ ప్రభావంతో ఆకాశానికి చిల్లు పడిందా అన్న విధంగా కురిసిన వర్షానికి.. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. నిన్న రాత్రి నుంచి విరామం లేకుండా కురిసిన కండపోత వానకు భాగ్యనగరం ముగినిపోయింది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకే నగరంలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. జడివానతో కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లొచ్చి చేరాయి. రోడ్లపై…
ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే తుఫాన్, భారీ వర్షాల వరదల నష్టాల అంచనాలకు నియోజక వర్గాలకు ఐఏఎస్ అధికారులను పంపించండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో పల్లెలు పట్టణాలు, నగరాలు అతులాకుతలం అవుతున్నాయి. రాష్ట్రంలో పంటలు, ఇళ్ళు, రోడ్లు, చెరువులు, కాలువలు నష్టాలకు గురవుతున్నాయి. భారీ వర్షాలకు వరదల్లో కొట్టుకుపోయి, ఇళ్లు కూలిపోయి ప్రాణ…
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి… హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవగా.. ఏకంగా 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం.. అయితే, తెలంగాణలో భారీ వర్షాలపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. సీఎస్ సోమేష్‌కుమార్‌కు ఫోన్ చేసిన గవర్నర్ తమిళిసై.. వర్షాలు, వరదల గురించి అడిగి తెలుసుకున్నారు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని గవర్నర్ తమిళిసై సూచించారు.…
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయానికి అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి అని వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తెలిపారు. బల్దియా కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన కమిషనర్ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ లను ఏర్పరు చేసారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయానికి అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ లు ఆదేశించారు. నగరంలోని…
తెలంగాణ వ్యాప్తంగా గులాబ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో.. ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.. రేపు, ఎల్లుండి జరగనున్న ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.. వాయిదా పడిన పరీక్షలు మరల…
గులాబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది… హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.. ఇక, హైదరాబాద్‌లో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది.. రానున్న 5, 6 గంటలు హైదరాబాద్ సిటీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ…
గులాబ్ తుపాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుపాన్ కారణంగా రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి,…
హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం నుంచే వర్షం ప్రారంభమైంది.. ఇప్పటికే.. సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి.. తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.. ఇక, సాయంత్నాకి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి.. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడీగూడ, ఇందిరా పార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. కూకట్‌పల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో…