ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా రాయ్‌పూర్ బ్లాక్‌లో శనివారం తెల్లవారుజామున క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు రాయ్‌పూర్ బ్లాక్‌లో సర్ఖేత్ గ్రామంలో వర్షం బీభత్సం సృష్టించినట్లు స్థానికులు వెల్లడించారు. వరదలు ఆ గ్రామాన్ని అల్లకల్లోలం చేశాయి.
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మరో రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనేపథ్యంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈవానలకు ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో.. ఉరుములు, మెరుపులతో, అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. దీంతో జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, వరంగల్,…
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ తీరం డిగాకు సమీపంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. తీరం దాటిన తర్వాత కూడా మరో 24గంటలు వాయుగుండంగానే ప్రయాణం చేయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షం వరదలకు కారణమైంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా 2,682 భవనాలు, అపార్ట్‌మెంట్లు జలమయం కావడంతో కనీసం 600 మంది నిరాశ్రయులయ్యారు.
వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈ తీవ్ర అల్పపీడనం.. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.