Heavy Rains In Hyderabad City: కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకున్న వరుణుడు.. మరోసారి విజృంభించాడు. హైదరాబాద్ నగరంలో తాండవం చేశాడు. బంజారాహిల్స్, లక్డికపూల్, అసెంబ్లీ, సచివాలయం, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్, మాధాపూర్, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, బేగంపేట, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, గోషామహల్, అబిడ్స్, సుల్తాన్ బజార్, అంబర్పేట్, బషీర్‌బాగ్, అఫ్జల్ గంజ్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగీ, మెహదీపట్నం, కార్వాన్, మాసబ్ ట్యాంక్, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో వరుణుడు చెలరేగిపోయాడు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం,…
Yellow Alert for Hyderabad: రాష్ట్రంలో కొద్దిసేపు ఓదార్పు తర్వాత వరణుడి ప్రతాపం మళ్లీ మొదలైంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం కాస్త చల్లబడింది. రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఇవాళ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, నగరంలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగుతుంది.కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లోని…
ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. శుక్రవారం రాజధాని లక్నో, ఉన్నావ్, ఫతేపూర్, సీతాపూర్‌లలో గోడలు, ఇల్లు కూలిన ఘటనల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి.. మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో అన్నట్టుగా.. ఇప్పుడు దాదాపు 115 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టేశాయి.. జులై, ఆగస్టుతో పాటు సెప్టెంబర్‌లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. జులై నెలలో కురిసిన వర్షాలకు ఊళ్లకు ఊళ్లే కొన్ని వారాల పాటు వరద ముంపునకు గురికాగా.. పూర్తిస్థాయిలో తేరుకోకముందే మరోసారి వర్షాలు అందుకున్నాయి.. దీంతో, మళ్లీ వరద ముంపు పెరుగుతోంది. జులై నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవగా.. ఆగస్టులో…
తెలంగాణాను వరుణుడు వీడనంటున్నాడు. నాలుగైదు రోజుల నుంచి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దైంది. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. అయితే ఈనేపథ్యంలో.. నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. దీనికి తోడు అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ మహానగరంతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.…