రాష్ట్రంలో వరుణుడు మళ్లీ భీభత్సం సృష్టించేందుకు సిద్దమయ్యాడు. రాష్ర్టానికి మరోమారు భారీ వాన ముప్పు వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు శుక్రవారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొంది. రేపు శనివారం అతి భారీ వర్షాలు ఉంటాయని, ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిమీటర్ల వేగంలో గాలి వేగం వుంటుందని తెలిపారు. ఈనేపథ్యంలో.. 7 నుంచి 9 వరకు అతి భారీ వర్షాలు కురిస్తాయని,…
పవిత్ర పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. కశ్మీర్ లోయలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అమర్‌నాథ్ పవిత్ర గుహ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు ముంచెత్తుతున్నాయి.
తెలంగాణను ఇప్పటికే భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడినా.. మరికొన్ని జిల్లాల్లో భారీ నష్టాన్ని మిగిల్చాయి.. అయితే, మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయిన వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.. నిన్నటి ఆవర్తనం ఇవాళ కూడా ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని.. పైకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకి వంపు…
Krishna Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నది శాంతించింది. దీంతో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 11 అడుగులకు తగ్గింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 9.7 లక్షలు, కాలువలకు 5,200 క్యూసెక్కుల నీటిని విడుదల…
తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని ఏళ్ల తర్వాత జులై నెలలో భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయి. గోదావరి పరిసర ప్రాంతాలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.