హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది… ఆకాశానికి చిల్లు పడిందా ? అనే తరహాలో రెండు గంటలకు పైగా ఎడతెరిపి లేకుండా వెర్రీ వాన కురుస్తోంది.. ఎప్పుడూ చూడాని.. ఎప్పుడూ విననతి తరహాలో వర్షం దంచికొడుతోంది.. ఉరుములు మెరుపులతో కూడిన వాన.. మూడు రోజులుగా విడవడం లేదు.. ఇవాళ గల్లీ గల్లీలో వాన అనే తరహాలో కుమ్మిపడేసింది… కొన్ని చోట్ల గణేష్ మండపాలు సైతం కొట్టుకుపోయాయి… రేపు గంగమ్మ ఒడికి గణపయ్యను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో…
కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో గత రెండు రోజులుగా.. కాస్త గ్యాప్ ఇచ్చి.. ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి.. వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.. వాహనదారులు.. ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ జామ్‌లతో నరకం చూస్తున్నారు.. అయితే, తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు..…
తెలంగాణలో మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి.. హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. సిటీలో ఇవాళ రెండు దపాలుగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. లోతట్టు ప్రాంతాలకు వర్షం నీరు చేరడంతో ఇక్కట్టు పడ్డారు.. అయితే, ఎప్పటికప్పుడు వర్షం నీరు వెళ్లేవిధంగా వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.. ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 70.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు…
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని కత్రా పట్టణంలోని మాతా వైష్ణో దేవి యాత్ర ఇవాళ పున:ప్రారంభం కానుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా శనివారం సాయంత్రం నుంచి ఈ యాత్రను నిలిపివేశారు.