తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు భాగ్యనగరం సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. నగరవాసులతంగా ఇంకా ఐదురోజుల పాటు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్ నగరంతో పాటు మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంటుందని ప్రకటించింది. కాగా.. 4 రోజులు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వెల్లడించారు.…
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మళ్లీ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని తెలియని కూలీలు ఇవాళ ఉదయం పనులకు వెళ్లారు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందపురం-జి.కొత్తపల్లి మధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న పాలేరు వాగులో 23 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు.
తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్కుమార్, నీటి పారుదలశాఖ అధికారులు, ఈఎన్సీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరు వాన కురిసింది. ఏకధాటి వర్షానికి మరోసారి వాగులు, వంకలు ఉప్పొంగాయి. రహదారులపైకి వరద నీరు చేరి.. వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
హబూబాబాద్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నారు. నర్సింహులపేట మండలం కొమ్ములవంచ కొత్తచెరువు కూడా జోరుగా అలుగు పారుతోంది. ఈ నేపథ్యంలో పెనుప్రమాదం తప్పింది.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. బాటసింగారం పండ్ల మార్కెట్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. మార్కెట్‌లోని దుకాణాలన్నీ తడిసిముద్దయ్యాయి. మార్కెట్ ప్రాంగణంలో నిల్వ ఉంచిన పండ్లన్నీ తడిసిపోయాయి. భారీ వర్షం వల్ల మార్కెట్‌లోకి ప్రవాహం దూసుకొచ్చింది. బత్తాయితో పాటు వివిధ రకాల పండ్లు వర్షం నీటిలో కొట్టుకుపోవడంతో వాటిని కాపాడుకునేందుకు వ్యాపారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.