Weather Update: బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీవర్షాలకు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలకు పలు వాతావరణ సూచనలు చేసింది. ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం కేంద్రీకృతం అయింది. ఇది వచ్చే 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం వుందని తెలిపింది. ఆ తరువాత ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్ మీదుగా క్రమంగా పశ్చిమ- వాయువ్య దిశగా కదిలే అవకాశం వుంది.
దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్రలో అక్కడడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని డా. బిఆర్ అంబేద్కర్
విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.
Also Read
ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇప్పుడు వాయువ్యం& ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ఒడిశా మరియు ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరం వద్ద ఉంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంది. వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనం ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఋతుపవనాల ద్రోణి ఇప్పుడు సముద్ర మట్టం వద్ద జైసల్మేర్, నుండి వాయువ్య & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంత కేంద్రం ఒడిశా మరియు ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరం మరియు ఆగ్నేయ దిశగా ఉత్తర అండమాన్ సముద్రం వరకు ఉంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు అందచేసింది. తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణా రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ, అత్యంత భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అవకాశం ఉంది. ఈ రోజు, తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు గాలి వేగం గంటకు 30 నుండి 40కిమీ వేగంతో కూడిన ఈదురు గాలులు తెలంగాణా రాష్ట్రంలో వీచే అవకాశం ఉంది.
Nithya Menen: నిత్యా గురించి ఆ విషయాలు తెలిసుంటే.. ప్రేమించే వాడినే కాదు
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?