తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను సైతం జారీ చేసింది. అయితే.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నాంపల్లి , అబిడ్స్ , కోఠి , బషీర్బాగ్ , నారాయణగూడ , గోషామహల్ , అఫ్జల్ గంజ్ , మంగళహట్ , బేగంబజార్ , మలక్ పేట్, సైదాబాద్ , యాకుత్పురా, చార్మినార్, కార్వాన్ లలో భారీగా వర్షం కురిసింది. అయితే ప్రజలు బయటికి రావద్దని అత్యవసర ప్రయాణాలు ఉంటే తప్ప బయటకి రావద్దని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
అయితే.. భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి నీరు వచ్చిచేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అంతేకాకుండా.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లపైకి వచ్చిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు. ప్రజలు మరో మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.