తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజుల పాటు మళ్ళీ వారణుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
హైదరాబాద్‌లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇవాళ ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిముద్దయ్యారు. భారీ వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామానికి చెందిన యువకులు గ్రామ శివారులో దసరా సంబరాల్లో భాగంగా, మిత్రులంతా కలిసి మద్యం సేవిస్తుండగా ఉన్నట్టుండి వారిపై పిడుగు పడింది. దీంతో మందు పార్టీకి హాజరైన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
New Idea: భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడటం సాధారణ విషయమే. వర్షం వస్తే ఇంటా, బయట ఏ పని పూర్తి కాదు. వర్షాలు, తుఫాన్లు వస్తున్నా అత్యవసర రంగాలకు చెందిన ఉద్యోగులు పలు జాగ్రత్తలతో పనిచేయాల్సి ఉంటుంది. తుఫాన్ కారణంగా అమెరికాలోని ఫ్లోరిడా నగరం అల్లకల్లోలంగా మారింది. నాలుగు రోజులుగా ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా జోరు వానలో, భీకర గాలిలోనూ అక్కడి పరిస్థితులను వివరించేందుకు కైలా అనే మహిళా రిపోర్టర్…
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది.. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ… ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది… ఈ అల్పపీడన ప్రభావంతో.. ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలలు కురుస్తాయని ఐఎండీ వర్గాలు చెబుతున్నాయి… ఇప్పటికే విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి… వర్షానికి తోడు తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి… ఇక, ఐఎండీ ఎల్లో వార్నింగ్…
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షం పడిందంటే సెంటీమీటర్లలో ఉంటుంది.. ఈ మధ్య హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వానలు దంచికొట్టాయి.. ఇప్పుడు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.. రేపటి నుంచి అంటే.. మంగళవారం నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు…
మూడు రోజుల నుంచి రాష్ట్రాన్ని వర్షం కమ్మేసింది. మూడురోజులుగా కురుస్తున్న భారీ వానలు రాష్ట్రం తడిసి ముద్దైంది. పలు చోటు అధిక వర్షపాతం నమోదైంది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.