Heavy Rains: మళ్లీ దంచికొడుతున్న వానలు.. మరో 4 రోజులు భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి.. హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. సిటీలో ఇవాళ రెండు దపాలుగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. లోతట్టు ప్రాంతాలకు వర్షం నీరు చేరడంతో ఇక్కట్టు పడ్డారు.. అయితే, ఎప్పటికప్పుడు వర్షం నీరు వెళ్లేవిధంగా వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.. ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 70.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో 60.4 ఎం.ఎం.. జోగులాంబ గద్వాల జిల్లాలో 51.6 ఎంఎం.. మంచిర్యాల జిల్లాలో 45.2 ఎంఎం.. పెద్దపల్లిలో 42 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.. ఇదే సమయంలో మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిస్తాయని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం..
Read Also: Minister Vemula Prashanth Reddy: స్పీకర్‌కు ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. లేకుంటే చర్యలు తప్పవు..!
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.. ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది… ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ.. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.. బుధవారం, శనివారం రోజుల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేయగా.. గురువారం, శుక్రవారాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.. ఇక, గురువారం రోజు హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!