Heavy Rain in Hyderabad: కుండపోత వాన.. హైదరాబాద్ అతలాకుతలం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది… ఆకాశానికి చిల్లు పడిందా ? అనే తరహాలో రెండు గంటలకు పైగా ఎడతెరిపి లేకుండా వెర్రీ వాన కురుస్తోంది.. ఎప్పుడూ చూడాని.. ఎప్పుడూ విననతి తరహాలో వర్షం దంచికొడుతోంది.. ఉరుములు మెరుపులతో కూడిన వాన.. మూడు రోజులుగా విడవడం లేదు.. ఇవాళ గల్లీ గల్లీలో వాన అనే తరహాలో కుమ్మిపడేసింది… కొన్ని చోట్ల గణేష్ మండపాలు సైతం కొట్టుకుపోయాయి… రేపు గంగమ్మ ఒడికి గణపయ్యను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో వినాయకుడి మండపాల్లోకి గంగమ్మ తరలి వచ్చిందా? అనేలా పరిస్థితి మారిపోయింది.. రాత్రి 8.30 గంటలకు మొదలైన రెండు గంటలకు పైగా కురుస్తూనే ఉంది..
Read Also: Asia Cup 2022: 71వ శతకాన్ని భార్య అనుష్క, కూతురు వామికకు అంకితం చేసిన కోహ్లీ
Also Read
భారీ వర్షాలతో భాగ్యనగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. రోడ్ల మీదకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుండడంతో.. వాహనదారులు ముందుకు కదలాలంటేనే వణికిపోతున్నారు.. దీంతో.. పలు చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది.. రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది.. ఇవాళ సాయంత్రం కురిసిన వర్షంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాలు జలమయం కాగా.. మళ్లీ దంచికొట్టినవాన భాగ్యనగర్ వాసులు వణికిపోయేలా చేస్తోంది.. అయితే, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికస్తున్నారు..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!