గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు బీభత్సం సృష్టించినా.. ఆ తరువాత తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజుల నుంచి ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో వేసవికాలాన్ని తలపిస్తోంది వాతావరణ పరిస్థితి. అయితే.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష సూచన అంటూ చల్లని కబురు చెప్పింది. వాతావరణ శాఖ సూచించినట్లుగానే.. గత రెండు రోజులుగా తెలంగాణలో వాతావరణ చల్లబడింది. అయితే ముందుగా చెప్పినట్లుగానే నిన్న రాత్రి తెలగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. రాజధాని హైదరాబాద్ లో కూడా నిన్న పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.
అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనం మండలంలో రికార్డు స్థాయిలో 231.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తరువాతం రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ జిల్లాలతో పాటు. మహబూబాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, నిర్మల్, జగిత్యాల, వరంగల్, నిజామాబాద్, హనుమకొండ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణకు మరో 24 గంటల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.