Landslide: మహారాష్ట్రలోని రాయగఢ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి జరిగిన ఈ పెను ప్రమాదంలో 30కి పైగా కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయ్యాయని భయాందోళన చెందుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా ముసురు పడుతుండగా.. ఇవాళ్టి(బుధవారం) నుంచి మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
నైరుతు రుతుపవనాలతో కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి పలు చోట్ల రహదారులు మూతబడ్డాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ( శనివారం ) సాయంత్రం ఆరు గంటల తర్వాత మరోసారి భారీగా వర్షం కురుస్తోంది. గత నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు వానా పడుతుంది. ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం ప్రయత్నిస్తున్నారు. దీంతో వర్షం గట్టిగానే దంచి కొడుతుంది.
దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు వర్షం దెబ్బకి నానా అవస్థలు పడుతున్నాయి. భారీ వర్షాలతో పలు రాష్ట్రాల్లోని గ్రామాలు పూర్తిగా వరద ప్రభావంతో అస్థవ్యస్థం అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, మరోసారి భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మధ్యంతర సహాయంగా కేంద్రం నుండి రూ. 2,000 కోట్లు కోరారు.
నైరుతు రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా 145 మందికిపైగా మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
కులు ప్రాంతంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో వధూవరులు కులులో పెళ్లి మండపానికి వెళ్లలేకపోయారు. దీంతో ఆన్‌లైన్‌లో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆశిష్, శివానీల మ్యారేజ్ జరిపించారు. ఈ ఆన్‌లైన్ పెళ్లికి వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ కూడా హాజరయ్యారు.
Telangana Rains: తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే నగరం తడిసి ముద్దయింది.