దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 206.26 మీటర్ల స్థాయికి చేరుకుంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రానున్న ఐదు రోజుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు పడతాయని భారత వాతావరణశాఖ పేర్కొంది.
రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. వేర్వేరు ఘటనల్లో 8 మంది మృతి చెందారు.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షల్‌వాడి గ్రామంలో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటంతో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దత్తత తీసుకోనున్నట్లు శివసేన తెలిపింది.
Talasani: అవసరమైతే వారికి నష్టపరిహారం ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని, పరిసర ప్రాంతాలను మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.
తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనాలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు.. వర్షాలు ఆగాయి కదా అని ఊపిరి పీల్చుకొనేలోపు ఇప్పుడు మరో బాంబ్ లాంటి వార్తను అధికారులు చెప్పారు..ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండొచ్చని ప్రకటించింది.. దీంతో జనాలు భయపడుతున్నారు.. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, కొమురంభీమ్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు… హనుమకొండ, వరంగల్,…
ఢిల్లీలో యమునా నది నీటి మట్టం శుక్రవారం మరోసారి ప్రమాద స్థాయి 205.33 మీటర్లను దాటి ప్రవహిస్తోంది. యమునా నది శాంతించిందని ఢిల్లీ ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మరోసారి వరద ప్రవాహం పెరగడంతో ఆందోళనకు గురవుతున్నారు.
ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నందున మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించింది. కోస్తాంధ్ర – ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.
హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు నిండుకున్నాయి. వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్ నగర్, షాబాద్ నుంచి జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఈ క్రమంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయానికి చెందిన రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. భారీగా కురుస్తున్న వర్షాలకు జనాలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.. కామారెడ్డిలో పరిస్థితి దారుణంగా ఉంది.. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. భారీ వర్షాల కారణంగా భీమేశ్వర వాగు, పాల్వంచ వాగు, నల్లమడుగు మత్తడి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వర్షం ధాటికి జిల్లా…