పెళ్లి అంటే మనందరి జీవితంలో ఒక గొప్ప అనుభూతి.. అలాంటి పెళ్లికి ఒక్కోసారి అనుకోని అటంకాలు ఎదురైతాయి. అయితే, ఓ జంట మాత్రం వేదమంత్రాలు, పెద్దల ఆశీర్వాచనాలతో వివాహబంధంలోకి అడుగుపెడదామని అనుకున్నా తరుణంలో వాళ్లకి అనుకోని రీతిలో ప్రకృతి విపత్తూ అడ్డు తగిలింది. ఓ వైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వరదలు పొట్టెత్తడంతో కొండచరియలు విరిగిపడి పడటంతో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో తాము ఒక్కటయ్యేందుకు ఇవేవీ అడ్డంకులు కాదనుకుంది ఆ జంట. కరెక్టుగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికే ఆన్‌లైన్‌లో మ్యారేజ్ చేసుకుని.. తమ జీవితంలో కొత్త అంకానికి నాంది పలికారు.
Read Also: Faria Abdullah: స్త్రీ-పురుషులు ఎప్పటికీ సమానం కాదు..ఫరియా అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
ఇదీ.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో అతలాకులతమవుతున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సిమ్లా జిల్లా కోట్‌ఘర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ సింఘాకు, కులు జిల్లాలోని భుంతార్ ప్రాంతానికి చెందిన శివానీ ఠాకూర్‌కు కొద్ది రోజుల క్రితం పెద్దలు పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో వరదలు పొటెత్తాయి. దీంతో రాష్ట్రంలో వరదల ధాటికి రోడ్లు పూర్తిగా కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు నాశనం అయ్యాయి.
Read Also: Khushi: విజయ్ దేవరకొండ- సమంత కొత్త కాపురం.. రొమాన్స్ అయితే అదుర్స్
అయితే, కులు ప్రాంతంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో వధూవరులు కులులో పెళ్లి మండపానికి వెళ్లలేకపోయారు. దీంతో ఆన్‌లైన్‌లో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆశిష్, శివానీల మ్యారేజ్ జరిపించారు. ఈ ఆన్‌లైన్ పెళ్లికి వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ కూడా హాజరయ్యారు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పటికీ.. వెనకడుగు వేయకుండా ముహూర్త సమయానికి పెళ్లి జరగడంతో కుటుంబ సభ్యులతో పాటు కొత్త జంటపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.