గత మూడు రోజులుగా కురుస్తు్న్న వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. దంచి కొడుతున్న వర్షాలతోపలుచోట్ల కాలనీలు నీటమునిగాయి. మణికొండ పంచవటి కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంచవటి కాలనీ మునిగిపోయింది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. 48 గంటలుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టుల గేట్లు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
హైదరాబాద్ ను భారీ వర్షాలు వదలడం లేదు.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక బయటకు వచ్చి ఎక్కడికైనా పోదామానుకుంటే వర్షాలకు బండి మీద పోలేకున్నారు.. ఇక క్యాబ్ ను బుక్ చేసుకొని వెల్దామంటే టమోటా ధరల కన్నా ఎక్కువ ధరలతో షాక్ ఇస్తున్నారు.. కొద్ది దూరంకు కూడా వేలు వసూల్ చేస్తూ జనాలను హడాలెత్తిస్తున్నారు.. చిన్నపాటి వర్షానికి భాగ్యనగరం లో జనం ఇబ్బందులు మామూలుగా ఉండవు. కొన్నిచోట్ల రోడ్లు చెరువుల్ని తలపిస్తాయి. ఇక…
గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించడంతో జీహెచ్‌ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 2 breaking news, latest news, telugu news, harish rao, big news, heavy rains
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
రానున్న 24 గంటల్లో అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్రా, తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.. ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, అల్లూరి సీతారామరాజులలో అతి భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు.. రానున్న ఐదు రోజులు వర్షాల ప్రభావం కొనసాగుతుందని పేర్కొన్నారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు.