ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు కొనసాగుతుండటంతో భారీ వర్షాలు, వరద సంబంధిత సంఘటనలలో 100 మందికి పైగా మరణించారు. గత వారం వర్షం ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోనే దాదాపు 80 మంది మరణించారు.
ఉత్తరాది రాష్ట్రాలను గత మూడ్రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో యమునా నది ఉప్పొంగుతోంది.
పాకిస్థాన్‌లో ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాలు నీట మునుగుతున్నాయి. జూన్ 25 నుంచి కురుస్తున్న రుతుపవన వర్షాల కారణంగా దాదాపు 86 మంది మరణించగా.. 151 మంది గాయపడినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) నివేదించింది.
దేశ వ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాలు కుంభవృష్టితో అల్లకల్లోలం అవుతున్నాయి. ఎన్నడూలేనంతగా భారీ వర్షాలతో ప్రజలు అల్లలాడుతున్నారు. ఉత్తరాది రాష్ర్టాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులకు ఇవాళ( సోమవారం) ఫోన్ లో మాట్లాడారు. ఉత్తర భారత దేశంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదల దెబ్బకు రహదారులు తెగిపోయాయి. ఆయా ప్రాంతాలు, గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు పెద్ద పెద్ద భవనాలు కూడ పేకమేడలా కూలిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో…
Heavy Rains: ఉత్తర భారతదేశంలో రుతుపవనాలు బీభత్సం సృష్టించాయి. యమునా, దాని ఉపనదులు వర్షాలకు ఉప్పొంగుతున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో దాదాపు 12 మంది మరణించారు. రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
Jammu Kashmir: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఢిల్లీ ఇలా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.