అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న యాత్రికుల యాత్ర మధ్యలోనే నిలిపివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను ఆపివేసినట్టు అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఈదురు గాలులతో కూడిన వానా పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేట, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, సికింద్రాబాద్, ఈసీఐఎల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, నారాయణ గూడలో వర్షం కురుస్తుంది. అయితే.. మరో రెండు గంటల పాటు నగరంలో భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఐరోపా దేశమైన స్పెయిన్‌ను వరదలు అతలాకుతలం చేస్తు్న్నాయి. తీవ్రమైన తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాల వల్ల జరాగోజా నగరంలో వరద బీభత్సం నెలకొంది. భారీ వర్షం కారణంగా అనేక వీధులు జలమయమయ్యాయి.
Himachal Floods: ప్రస్తుతం భారత దేశంలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. చాలా రాష్ట్రాలు వర్షాల్లో కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వివిధ ఘటనల్లో పలువురు మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా 43 మంది మరణించారు. గత రెండు వారాల్లో సుమారు 80 మంది గాయపడ్డారు.
నైరుతి రుతుపవనాలుఆలస్యంగా ప్రవేశించినప్పటికీ ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. రుతు పవనాల మూలంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా అడపాదడపా కురిసిన వర్షంతో శుక్రవారం సాయంత్రం ముంబయిలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నీటిమయం అవుతున్నాయి..కర్ణాటక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. భారీ వర్షాలు కారణంగా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 8కి చేరుకుంది. గత 24 గంటల్లో దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో కురిసిన వర్షాలకు మొత్తం 35 ఇళ్లు ధ్వంసమయ్యాయి.. చాలా మంది తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు..దక్షిణ కన్నడ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇదే సమయంలో మెస్కాంకు చెందిన 108 విద్యుత్ స్తంభాలు,…
Spain Floods: స్పెయిన్‌లో ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవు. వర్షాలు, వరదల కారణంగా ఇక్కడ బీభత్సం నెలకొంది. చాలా నగరాలు నీట మునిగాయి. ఈశాన్య స్పెయిన్‌లోని జరాగోజా నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
గత నెల నుంచి పాకిస్తాన్‌లో కురుస్తున్న రుతుపవనాల వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా కనీసం 50 మంది మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.
ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో అక్కడక్కడ వానలు కురుస్తుండగా, గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ 3 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది.