దేశ ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగానే కుండపోత వర్షం కురిసింది. గురువారం కురిసిన కుండపోత వర్షానికి ముంబై, పూణె నగరాలు జలమయం అయ్యాయి.
అతి భారీ వర్షాలు ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఏజెన్సీలో వాగులు, గెడ్డల ఉధృతి కొనసాగుతుంది. గత వారం రోజులుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వందలాది గిరిజన గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
Due To Landslides Triggered By Heavy Rains In Ethiopia 146 are 50 Dead: తాజాగా ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోని మారుమూల ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ప్రస్తుతం అందిన సమాచారం మేరకు 146 మంది మరణించారు. ఈ మేరకు స్థానిక అధికారి ఒకరు ఇచ్చిన సమాచారం మేరకు.. దక్షిణ ఇథియోపియా లోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో జరిగిన బురద కారణంగా మృతి చెందిన వారిలో చిన్నారులు,…
Weather Alert: భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో నేడు ( సోమ), రేపు (మంగళవారం) భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల కుండపోత వర్షం పడుతుంది. ఉదయం నుంచి మేఘావృతమై ఉన్న వాతావరణం.. గత గంట నుంచి ఎడతెరిపి లేని వాన పడతుంది. పంజాగుట్ట, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, బాచుపల్లి, నిజాంపేట, మియాపూర్, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. అలాగే ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, అంబర్‌పేట్, మలక్‌పేట్‌లో భారీ వర్షం కురుస్తుంది.
ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా చార్‌ధామ్ యాత్రను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ కేంద్రం ఈ విషయాన్ని చెప్పింది.
Assam Floods : ప్రస్తుతం దేశం మొత్తం రుతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల మినహా దేశవ్యాప్తంగా ఈ రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Heavy Rain In Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (సోమవారం) తెల్లవారు జామున ఒంటి గంట నుంచి ఉదయం 7 గంటల వరకు ఎడతెరపిలేకుండ వాన పడుతుంది.
అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు చెరువులయ్యాయి. ఎటు చూసినా నీళ్లే. కాలు కదపలేని పరిస్థితి. ఇంకో వైపు విష పురుగులు, జంతువుల సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలా 30 జిల్లాల్లో పరిస్థితులు క్లిష్టంగా మారిపోయాయి.