Due To Landslides Triggered By Heavy Rains In Ethiopia 146 are 50 Dead: తాజాగా ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోని మారుమూల ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ప్రస్తుతం అందిన సమాచారం మేరకు 146 మంది మరణించారు. ఈ మేరకు స్థానిక అధికారి ఒకరు ఇచ్చిన సమాచారం మేరకు.. దక్షిణ ఇథియోపియా లోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో జరిగిన బురద కారణంగా మృతి చెందిన వారిలో చిన్నారులు, గర్భిణులు కూడా ఉన్నారని స్థానిక అధికారి దగ్మావి అయేలే తెలిపారు. ఒక రోజు ముందు కొన్ని కొండచరియలు విరిగిపడటంతో రెస్క్యూ సిబ్బంది బాధితుల కోసం వెతకగా., సోమవారం ఉదయం సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది ప్రజలు సమాధి అయ్యారని., శిథిలాల నుంచి ఐదుగురిని సజీవంగా బయటకు తీశామని అయెలే తెలిపారు.
Union Budget 2024: కేంద్ర బడ్జెట్ పై స్పందించిన కేటీఆర్..
ప్రమాదంలో తల్లి, తండ్రి, అన్న, సోదరి సహా కుటుంబాన్ని కోల్పోయి మృతదేహాలకు అతుక్కుపోయిన చిన్నారులు ఎందరో ఉన్నారని., సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. జూలై నెలలో ప్రారంభమయ్యే వర్షాకాలంలో ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణం. ఈ వర్షాకాలం సెప్టెంబర్ మధ్య వరకు కొనసాగే అవకాశం ఉంది.
Sara Ali Khan: పింక్ డ్రెస్సులో పరువాలు వలకబోస్తున్న సారా అలీ ఖాన్