మిజోరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ కూలిపోవడంతో 10 మంది కార్మికులు చనిపోయారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్‌లో రెమల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో బెంగాల్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా.. తుఫాన్ ఎఫెక్ట్తో బెంగాల్ తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ఆస్తికి విస్తృతమైన నష్టాన్ని చవిచూశాయి. రెమల్ తుఫాను బెంగాల్ రాష్ట్రం పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో గంటకు 135 కిమీ వేగంతో గాలులు వీచినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సెంట్రల్ కోల్‌కతాలోని ఎంటల్లీలోని బిబీర్ బగాన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా…
Afghanistan Flood : ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు.
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది.