అతి భారీ వర్షాలు ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఏజెన్సీలో వాగులు, గెడ్డల ఉధృతి కొనసాగుతుంది. గత వారం రోజులుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వందలాది గిరిజన గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఆంధ్ర- ఒడిస్సా సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయిన వైనం ఏర్పాడింది. రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. గెడ్డలు సైతం ఉగ్ర రూపం దాల్చుతున్నాయి. కోతకు గురవుతున్న ప్రధాన వంతెనలు.. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పాడింది.
Read Also: Budget 2024: క్రీడారంగానికి రూ.3,442 కోట్లు.. ‘ఖేలో ఇండియా’కు అత్యధిక నిధులు!
ఇక, పలు గిరిజన గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఏఓబీ ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ముంచుకొస్తుంది. భారీ వర్షాలు ధాటికి రాత్రి వేళల్లో ఘాట్ రోడ్లలో రాకపోకలను అధికారులు నిషేధం విధించారు. పాడేరు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, కొయ్యురు, డుంబ్రిగూడ మండలాల పరిధిలో ఉదృతంగా వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఈదురు గాలులకు తెగిన విద్యుత్ వైర్లతో కరెంట్ స్తంభాలు నెలపై పడిపోయాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పాడింది. చాలా వరకు ఏజెన్సీ గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.