హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇవాళ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఈ మేరకు ఎల్లో వార్నింగ్ కూడా జారీ చేసింది.. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీని కారణం.. పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ…
హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం కురుస్తోంది… బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్ట, అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది… దీంతో.. ప్రధాన రహదారులపై వరద నీరు పొంగిపొర్లుతోంది.. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన జంక్షన్లలో సైతం రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరింది.. దీంతో.. పలుచోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు…
రాగల 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు.. ఒకటి, రెండు ప్రాంతాల్లో.. కొన్ని జిల్లాలలో ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ కేంద్రం.. నిన్న ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలోని ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల దగ్గర స్థిరంగా కొనసాగుతుంది. అల్పపీడనానికి…
నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై కనిపిస్తోంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో జోరగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జాము నుంచి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్‌లోని హుజూరాబాద్, జమ్మికుంట, వేములవాడ, శంకరపట్నం, సైదాపూర్‌లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెలపిలేని వర్షం కురుస్తోంది. కామారెడ్డిలో భారీ వర్షం కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.…
టౌటే తుఫాన్ ధాటికి తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఆ తుఫాన్ ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇక, దీని ప్రభావం తెలుగురాష్ట్రాలపై పడింది. హైదరాబాద్‌లో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే భారీ వర్షం కురవడం మొదలైంది. బంజారాహిల్స్,…
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా, ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం వరకు మారిపోయింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయి. వర్షం కురిసే ముందు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.